మూడవ ప్రపంచ యుద్ధం వస్తే
జాతీయ National News భారత్ ప్రతినిధి : కొన్ని దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధాలు, కొన్ని దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేండ్ల నుంచి జరుగుతున్న ఈ ప్రాంతీయ యుద్ధాలు కాస్తా మూడో ప్రపంచ యుద్ధంగా మారితే. ప్రపంచంలో శక్తిమంతమైన రష్యా, అమెరికా, చైనా లాంటి దేశాలు ఆ యుద్ధంలో పాల్గొంటే అప్పుడు ప్రపంచం పరిస్థితి ఏంటి ప్రజలు ఎటువంటి విపరీతమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అసలు అలాంటి భీకర యుద్ధం జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి.
ప్రపంచ యుద్ధం అంటే ఆషామాషీ విషయం కాదు. ఆ విధ్వంసాన్ని భరించడం అంత ఈజీ కాదు. మొదటి ప్రపంచ యుద్ధంలో నాలుగు కోట్ల మంది పౌరులు, సైనికులు చనిపోయారు. రెండో ప్రపంచ యుద్ధంలో దాదాపు ఆరు కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం వల్ల వచ్చిన అనారోగ్యం, కరువు వల్ల ఎంతోమంది ఇబ్బందిపడ్డారు. ఈ రెండు యుద్ధాల తర్వాత ప్రపంచం టెక్నాలజీలో చాలా డెవలప్ అయ్యింది. ముఖ్యంగా చాలా దేశాలు కొత్త కొత్త ఆయుధాలు సమకూర్చుకున్నాయి. ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఆ ఆయుధాలన్నీ వాడితే ప్రపంచ మనుగడకు ముప్పు తప్పదు.
ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం వస్తే అది కచ్చితంగా అణుయుద్ధంగానే మారుతుంది. అంటే ప్రపంచమంతా హిరోషిమా, నాగసాకికి పట్టిన గతే పడుతుంది. ప్రకృతి కోలుకోలేని దెబ్బ తింటుంది. అసలు జీవి మనుగడే సాధ్యం కాకపోవచ్చు. ఇక ప్రాణ నష్టాన్ని అంచనా కూడా వేయలేం. ఎందుకంటే పెద్ద దేశాల యుద్ధ సామర్థ్యం మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలతో పోలిస్తే చాలా ఎక్కువ. చాలా దేశాల దగ్గర కావాల్సినంత అణుశక్తి ఉంది.
అణ్వాయుధాలు మనుషులు కనిపెట్టిన అత్యంత శక్తివంతమైన, విధ్వంసక ఆయుధాలు. ఇవి అంతులేని శక్తిని విడుదల చేస్తాయి. దాంతో భారీ పేలుళ్లు జరగడంతోపాటు రేడియేషన్ ఏర్పడుతుంది. అమెరికా1945లో జపాన్ మీద ఈ అణ్వాయుధాలను రెండుసార్లు ప్రయోగించింది. ఆ తరువాత మళ్లీ ఏ దేశమూ ప్రయోగించే ధైర్యం చేయలేదు. కానీ అప్పటినుండి కొన్ని దేశాలు వందల సార్లు పరీక్షించాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం తొమ్మిది దేశాల దగ్గరే అణ్వాయుధాలు ఉన్నాయి.
Cold wars between some countries and outright wars between some countries are on the rise. If these regional wars that have been going on for years turn into a third world war. If the powerful countries like Russia, America and China take part in that war, then what will be the situation of the world and what kind of extreme conditions will the people have to face.
A world war is no mean feat. Coping with that destruction is not easy. Four crore civilians and soldiers died in the First World War. About six crore people lost their lives in World War II. Illness from war and famine Many are troubled. After these two wars the world developed a lot in technology. In particular, many countries have acquired new weapons. If there is a third world war, if all those weapons are used, the survival of the world will be threatened.
If there is a third world war, it will definitely be a nuclear war. That means the whole world will suffer the fate of Hiroshima and Nagasaki. Nature suffers an irreparable blow. It may not be possible for the original organism to survive. The loss of life cannot be estimated. Because the war capability of big countries is much higher compared to the first and second world wars. Most countries have sufficient nuclear power.
Nuclear weapons are the most powerful and destructive weapons ever invented by humans. They release endless energy. That causes massive explosions and radiation. America used these nuclear weapons twice on Japan in 1945. After that no country dared to launch again. But some countries have tested it hundreds of times since then. So far only nine countries in the world have nuclear weapons.