Type Here to Get Search Results !

Sports Ad

నెయ్యిని ఇలా తీసుకుంటే రోగాలు పరార్​ If You Take Ghee Like This You Will Get Rid Of Diseases


 నెయ్యిని ఇలా తీసుకుంటే రోగాలు పరార్​

ఆరోగ్యం Health News భారత్ ప్రతినిధి : మనం తినే ఆహారంలో ఖచ్చితంగా నెయ్యి ఉంటుంది. నేటికీ అమ్మమ్మలు నెయ్యిని ఆరోగ్య సంపదగా భావిస్తారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో నెయ్యిని తప్పనిసరని పెద్దలు చెబుతారు. సాధారణంగా కొందరు ఉదయం నిద్రలేచిన వెంటనే  గోరు వెచ్చని నీటిలో ఒక స్పూన్​ నెయ్యి కలుపుకొని  తాగుతారు. నెయ్యిని గోరువెచ్చని నీళ్లలో కలుపుకొని తాగితే చాలు చాలా  ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

గుండ ఆరోగ్యానికి : ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో ఒక స్పూన్​ నెయ్యి కలుపుకుని తాగితే గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. నెయ్యిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్‌ గుండెకు చాలా మేలు చేస్తాయి. ఇది కాకుండా, కేలరీలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు ఎ, ఇ మొదలైనవి నెయ్యిలో లభిస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకోవడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది.

రోగ నిరోధక శక్తి : ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో 2 టేబుల్‌ స్పూన్ల నెయ్యి కలిపి తాగడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతోపాటు అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి.ఎముకలు ధృడంగా తయారవుతాయి. 

మలబద్ధకం : మలబద్ధకంతో బాధపడేవారు ఖచ్చితంగా నెయ్యి, నీళ్ల తాగాలి.పెద్ద, చిన్న ప్రేగులలో పొడిగా ఉన్నప్పుడు ఆహారం జీర్ణం కావడం కష్టం. మలబద్ధకం సమస్య ఉంటే గోరువెచ్చని నీళ్లలో నెయ్యి కలిపి తాగడం వల్ల జీర్ణక్రియ జరుగుతుంది.

కళ్లకు మేలు : గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే కళ్లకు అద్భుతంగా పనిచేస్తుంది. నెయ్యి తినడం వల్ల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కంటి చూపును మెరుగుపరుస్తుంది. కంటి పొడిబారడాన్ని తగ్గిస్తుంది మరియు కంటి అలసటను తొలగిస్తుంది. కళ్ల చుట్టూ నెయ్యి రాసుకున్న మంచి ఫలితం ఉంటుంది.

చర్మాన్ని మృదువుగా : చలికాలంలో గోరువెచ్చని నీళ్లలో నెయ్యి కలిపి తాగడం వల్ల పేగులు శుభ్రపడి శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగిపోతుంది. చర్మానికి సహజమైన మాయిశ్చరైజింగ్‌గా నెయ్యి మేలు చేస్తుంది. చర్మం లోపలి నుంచి తేమగా ఉన్నప్పుడు చర్మం పొడిబారడం కూడా తగ్గుతుంది.

జలుబు దగ్గు దూరం : రోజూ నెయ్యిని గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగడం వల్ల అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. జలుబు దగ్గు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. నెయ్యి, గోరువెచ్చని నీరు ముక్కు, గొంతు, ఛాతీకి సంబంధించిన ఇన్ఫెక్షన్లు దూరం అవుతాయి.

The food we eat definitely contains ghee. Even today, grandmothers consider ghee as a source of health. Elders say that ghee is a must in food to be healthy. Generally, some people drink warm water with a spoonful of ghee as soon as they wake up. Drinking ghee mixed with warm water has many benefits. Now let us know about such benefits.

మరిన్ని వార్తల కోసం.... 
* మూడవ ప్రపంచ యుద్ధం వస్తే ఇక్కడ క్లిక్ చేయండి
* రెయిన్​ శ్నాక్స్​ ఆలూ బోండా తిన్నారంటే ఇక్కడ క్లిక్ చేయండి
* ఆర్టీసీలో రాఖీ జోష్ ఒక్కరోజే 63.86 లక్షల మంది ప్రయాణం ఇక్కడ క్లిక్ చేయండి
* నెలవారీ రీఛార్జ్ చేయలేకపోతున్నారా ఈ రూ.198 ప్లాన్ మీకోసమే ఇక్కడ క్లిక్ చేయండి
* జీలకర్ర నీళ్లు ఈ సమస్యలకు దివ్య ఔషధం ఇక్కడ క్లిక్ చేయండి
* ఎలాంటి ప్లేట్​ లో అన్నం తినాలో తెలుసా ఇక్కడ క్లిక్ చేయండి
* రూ.2లక్షలకు పైగా ఉన్న రుణాల మాఫీకి గైడ్​లైన్స్ ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies