రాఖీ పండుగ రోజు ఆకాశంలో అద్భుతం అది ఏంటంటే
జాతీయ National News భారత్ ప్రతినిధి : రక్షా బంధన్ రోజు అందరికీ ప్రత్యేకమైనది. అంతరిక్షం పై ఆసక్తి ఉన్న వారికి మరీ ప్రత్యేకం కానుంది. ఎందుకంటే ఈ ఆగస్టు 19న ఆకాశంలో బ్లూ మూన్ కనిపించనున్నాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే పౌర్ణమి రోజున చంద్రుడు ఎందుకు అంతే ప్రత్యేకంగా ఉంటాడు అనే ప్రశ్న చాలామంది మదిలో తలెత్తుతుంది. మరి దాని వెనుక ఉన్న సైన్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రాఖీ పండుగ రోజు ( ఆగస్టు 19) ఆకాశంలో సూపర్ బ్లూ మూన్ కనువిందు చేయనుంది. రోజూ వచ్చే చంద్రుడిలాగా కాకుండా జాబిల్లి ఆగస్టు 19 న పెద్దగా, అత్యంత కాంతివంతంగా కనిపించనుంది. భూమికి అత్యంత సమీపానికి చంద్రుడు వచ్చినపుడు పౌర్ణమి రావడంతో ఆకాశంలో ఈ అద్భుతమైన సూపర్ బ్లూ మూన్ అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఈ సంవత్సరంలో మొదటి సూపర్ మూన్ ఈ సోమవారం ( ఆగస్టు 19) రాబోతోంది.
సూపర్ మూన్ అంటే ఏమిటి చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు కొన్నిసార్లు భూమికి దగ్గరగా వస్తుంది. మరికొన్ని సార్లు అది భూమికి దూరంగా కదులుతూ ఉంటుంది. చంద్రుడు భూమికి 90 శాతం సమీపంలో ఉన్నప్పుడు అద్భుతాలు జరుగుతుంటాయి. అలాంటి రోజునే సూపర్ మూన్ ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ రోజున చంద్రుడు పూర్తిగా కనిపిస్తాడు. చంద్రుడు దగ్గరగా ఉండటం వల్ల, అది పరిమాణంలో కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది. దాన్ని సూపర్ మూన్ అంటారు.సూపర్ మూన్‌లు సాధారణంగా సంవత్సరానికి 3-4 సార్లు సంభవిస్తాయి.
ఈ ఆగస్టు నెలలో సూపర్ మూన్, బ్లూ మూన్ కలిసి వచ్చే అరుదైన ఖగోళ సంఘటనను చూడటానికి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది దశాబ్దానికి ఒకసారి మాత్రమే జరిగే సంఘటన. ఆగస్టులో వచ్చే పౌర్ణమికి ఇచ్చే సంప్రదాయ నామం 'స్టర్జన్ మూన్' కాబట్టి, ఈ సూపర్ మూన్ బ్లూ మూన్ ను 'స్టర్జన్ మూన్' అని కూడా పిలుస్తారు. ఈ సంవత్సరం వరుసగా రాబోతున్న నాలుగు సూపర్ మూన్ లలో ఇది మొదటిది (తర్వాతవి సెప్టెంబర్ 18 న, అక్టోబర్ 17, నవంబర్ 15 న రానున్నాయి).
ఒక్కో రోజు ఒక్కోవిధంగా ఉదయిస్తాడు. చంద్రుడు ఎనిమిది దశల్లో ఆకాశంలో కనిపిస్తాడు. కొన్నిసార్లు పూర్తిగా, కొన్నిసార్లు సగం ఇలా కనిపిస్తాడు. చంద్రుని దశల చక్రం ఒక నెల పాటు కొనసాగుతుంది. అందుకే మనం సాధారణంగా సంవత్సరంలో 12 పౌర్ణమి చంద్రులను చూస్తాము బ్లూ మూన్ ను ఎక్కడ ఏసమయంలో అంటే.
భారతదేశం : ఆగస్టు 19 రాత్రి 8 గంటల నుంచి ఆగస్టు 20 తెల్లవారుజాము 5.32 వరకు.
ఉత్తర అమెరికా : వాళ్ల కాలమానం ప్రకారం ఆగస్టు 19 మధ్యాహ్నం 2:26 ఇడిటి (ఈస్టర్న్ డేలైట్ టైమ్) సూపర్ బ్లూమూన్ కనిపిస్తుంది.
యూరప్ : ఆగస్టు 18 సాయంత్రం నుండి ఆగస్టు 19 రాత్రి వరకు, ఆగస్టు 20 తెల్లవారుజాము వరకు.
ఆఫ్రికా : ఆగస్టు 18 సాయంత్రం నుండి ఆగస్టు 19 రాత్రి వరకు మరియు ఆగస్టు 20 తెల్లవారుజాము వరకు.
కానీ నాసా ప్రకారం, ఇది ఆదివారం ఉదయం నుండి బుధవారం తెల్లవారుజాము వరకు సుమారు మూడు రోజుల పాటు నిండుగా కనిపిస్తుంది. సూపర్ మూన్ ను ఎలా వీక్షించాలి ముఖ్యంగా సిటీ లైట్లకు, లైట్ల కాలుష్యానికి దూరంగా ఉన్న చీకటిగా ఉన్న ప్రదేశంలోనుంచి వీక్షించాలి. హై క్వాలిటీ కెమెరా ఉంటే ఆ దృశ్యాలని బంధించవచ్చు. ముందుగానే వ్యూయింగ్ స్పాట్ కు వెళ్లి చంద్రుడి వివిధ దశలను మిస్ కాకుండా చూసుకోవాలి. బైనాక్యులర్లు లేదా టెలిస్కోపులు ఉంటే క్లియర్ గా కనపడుతుంది. కెమెరాతో చిత్రాలు తీయాలనుకుంటే మంచి లాంగర్ ఎక్స్‌పోజర్ కెమెరా వాడండి. స్మార్ట్ ఫోన్ వాడితే మ్యాన్యువల్ గానే ఎక్స్‌పోజర్ అడ్జస్ట్ చేసుకోండి. బయటి వాతావరణం నేరుగా చంద్రుణ్ని చూడ్డానికి సహకరించకపోతే ఏదైనా లైవ్ స్ట్రీమింగ్ చూసి ఆనందించండి.
Raksha Bandhan day is exceptional for everybody. It will be exceptionally unique for the people who are keen on space. Since researchers say that a blue moon will show up overhead on August 19. In any case, the inquiry emerges in many personalities why the moon is so unique on the full moon day. Presently we should know the science behind it.
Upon the arrival of Rakhi celebration (August 19) a very blue moon will be noticeable overhead. Dissimilar to the customary moon, Jabilli will seem greater and more brilliant on August 19. At the point when the moon comes nearest to the earth, the full moon will uncover this astounding very blue moon wonder overhead. The principal Super Moon of the year is coming this Monday (August 19).
Be that as it may, as per NASA, it will be completely apparent for around three days, from Sunday morning to early Wednesday morning. Step by step instructions to see the super moon ought to be seen from a dull spot away from city lights and light contamination. A great camera can catch those scenes.
Early survey spot Go to and make a point not to miss the different periods of the moon. Optics or telescopes should be visible plainly. To take pictures with a camera, utilize a decent longer openness camera. In the event that you are utilizing a PDA, change the openness physically. Appreciate observing any live streaming on the off chance that the weather conditions outside isn't helpful for seeing the moon straightforwardly.