నీళ్లపల్లి గ్రామాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో
బషీరాబాద్ Basheerabad News భారత్ న్యూస్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం శనివారం రోజున నీలపల్లి గ్రామాన్ని ఎంపీడీవో జి.యాదయ్య సందర్శించిచడం జరిగింది. ఎమ్మెల్యే ఆదేశాలనుసారంగా నీలపల్లి గ్రామాన్ని సందర్శించి గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రజలతో అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎస్సీ కాలనీలో మరియు బీసీ కాలనీలో ఉన్న నీటి సమస్య గురించి కూడా తెలుసుకొని మరమ్మత్తు పనులు చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించడం జరిగింది.
త్రాగునీరు దగ్గర బట్టలు ఉతకరాదని,నీటిని వృధా చేయరాదని మహిళలకు వివరించారు.ప్రతి వీధుల గుండా రోడ్ల గుండా ఉన్న వీధి దీపాలను కూడా పునరుద్ధరించాలని తెలిపారు. అలాగే ప్రాథమిక పాఠశాలను మరియు అంగన్వాడీని కూడా సందర్శించి విద్యార్థుల వివరాలను తెలుసుకొని అదేవిధంగా పలు రికార్డులు పరిశీలించారు.
MPDO G.Yadaiah visited Neelapally village of Basheerabad mandal of Vikarabad district on Saturday. As per the instructions of the MLA, he visited Neelapally village and asked the people about the problems in the village. Also the Panchayat Secretary was instructed to take cognizance of the water problem in SC Colony and BC Colony and carry out repair work.
It was explained to the women that they should not wash their clothes near drinking water and should not waste water. They also said that the street lights in every street should be restored. Also visited the primary school and Anganwadi to know the details of the students and also examined various records.