కొత్త రేషన్ కార్డుల కోసం చూస్తున్నారా ?
* అర్హులందరికీ రేషన్ కార్డులు
* కేబినెట్ సబ్ కమిటీ భేటీలో కీలక అంశాలపై చర్చ
* వైట్ కార్డు ఆదాయ పరిమితిపైనా డిస్కషన్
* ఆరోగ్య శ్రీ కార్డుల జారీకి మార్గదర్శకాల పైనా
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : కొత్త రేషన్,హెల్త్ కార్డుల జారీ కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ఇవాళ సెక్రటేరియట్లో జరిగింది. సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. రేషన్ కార్డు, హెల్త్ కార్డులకు అర్హతలు, విధివిధానాలపై చర్చిస్తున్నారు. వార్షికాదాయ పరిమితమైనే ప్రధానంగా చర్చ జరిగింది.
రాష్ట్రంలో చాలా కాలంగా రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో లక్షలాది మంది వీటి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు కార్డుల జారీ కోసం ఇటీవలే ఉత్తమ్ కుమార్ చైర్మన్గా ముగ్గురు సభ్యుల సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిటీ తొలి సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. కొత్త కార్డుల జారీకి దరఖాస్తులు ఎప్పటి నుంచి స్వీకరించేంది. జారీ ప్రక్రియపై త్వరలో విధివిధానాలను జారీ చేయనున్నారని తెలుస్తోంది.