చిత్రహింసలు పెడ్తున్నాడని ఎస్ఐ పై ఫిర్యాదు చేసిన ప్రజా సంఘ నాయకులు
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : కొడుకు కేసులో తల్లిని విచారణ పేరుతో మహిళా పై బషీరాబాద్ ఎస్ఐ చిత్రహింసలు చేస్తున్నారని ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి.లోహడ కళావతికి మద్దతు గా బాధితురాలికి న్యాయం జరిగే వరకూ దళిత సంఘాలు శుక్రవారం రోజున బషీరాబాద్ ఠాణా ఎదుట ఆందోళన చేశాయి.వివరాల్లోకి వెళ్తే బషీరాబాద్ మండల పరిధిలో నవల్గా గ్రామానికి చెందిన లోగడ నరేష్(17) తండ్రి నర్సప్ప గత 3 నెలల క్రితం ఒక అమ్మాయిని తీసుకొని కనిపించడం లేదు.
బాలిక తల్లిదండ్రుల పిర్యాదు మేరకు ఎస్ఐ గత 3 నెలల నుండి బాలుడి తల్లి కళావతి ఈ యొక్క కేసు విచారణ కొరకు పోలీస్ స్టేషన్ కి దినమంతా కూర్చో బెట్టుకొని పంపించేవారు అని మరియు కుమారుని ఆచూకీ చెప్తావా ? లేదా ? అని బూతులు తిట్టడం,తుపాకీతో చంపుతా బెదరించడం జరిగిందని అని తాండూర్ డిఎస్పీ బాలకృష్ణ కలిసి బషీరాబాద్ ఎస్ఐ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, నవీన్, జీడీ స్పార్టకస్, కె.శ్రీనివాస్,కెవిపిఎస్ కార్యదర్శి సురేష్,ఆనందకుమార్, కృష్ణ, మహేందర్,బుగ్గప్ప,తదితరులు పాల్గొన్నారు.