రాజీనామా చేయనున్న జపాన్ ప్రధాని
జాతీయ National News భారత్ ప్రతినిధి : జపాన్‌లో వెలుగు చూస్తున్న రాజకీయ కుంభకోణాలు, జీవన వ్యయాలు పెరగడంతో ప్రజల్లో వెల్లువెత్తిన అసంతృప్తికి జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా తలొగ్గారు. వచ్చే నెల పదవి నుంచి దిగిపోనున్నట్టు ప్రకటించారు. ప్రజల విశ్వాసం లేకుండా రాజకీయాలు నడవలేవని, రాజకీయ సంస్కరణలను ముందుకు తీసుకెళ్లాలనే దృఢ సంకల్పంతో ప్రజల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు.
The Prime Minister of Japan, Fumio Kishida, bowed to the unhappiness of the people due to the rising cost of living and the political scandals that are coming to light in Japan. He announced that he will step down from the post next month. He revealed that politics cannot run without people's trust and this decision was taken for the sake of the people with a strong will to advance political reforms.