తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయ శంకర్ కీలకం
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయ శంకర్ సార్ పాత్ర అమోఘమని బషీరాబాద్ ఎస్సై రమేష్ కుమార్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా మంగళవారం బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్సై రమేష్ కుమార్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను యావత్ ప్రపంచానికి చాటి చెప్పి, రాష్ట్ర సాధనకోసం తన జీవితాన్ని ధారబోసిన గొప్ప మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని అంతటి గొప్పమనిషిని అధికారికంగా స్మరించుకోవడం ఎంతో గర్వకారణంగా ఉందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మల్లేషం, రాందాస్, శ్రీనివాస్,మమత, బాల్రాజ్, హకీమ్ పాల్గొన్నారు.
Basheerabad SI Ramesh Kumar said that Professor Jaya Shankar sir's role in the achievement of Telangana state is amazing. On the occasion of Professor Jayashankar's birth anniversary, Basheerabad police station installed a portrait of him on Tuesday and paid tributes by placing floral garlands.On this occasion,SI Ramesh Kumar said that it is a matter of pride to officially remember the great man Prof.Jayashankar sir who shared the aspiration of a separate state to the whole world and laid down his life for the state.