డాక్టర్ ని ఆత్మ హత్యనా ? హత్యనా ?
క్రైమ్ న్యూస్ : ఆర్ జి కార్ మెడికల్ కాలేజీ(పశ్చిమబెంగాల్)లో దారుణమైన సామూహిక అత్యాచారం, లేడీ డాక్టర్ హత్య పై జ్యూడిషియల్ ఎంక్వైరీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి తో నిర్వహించాలి.ఆగస్టు 9వ తేదీ తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య యువ వైద్యురాలిపై దారుణంగా సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. ఆమె రెస్పిరేటరీ డిపార్ట్‌మెంట్‌లో నైట్ డ్యూటీ చేస్తూ హాస్పిటల్ ఆవరణలోని సెమినార్ రూమ్‌లో ఉంది. ఆమెపై జరిగిన దారుణమైన దాడికి సంబంధించిన విషయాలు పోస్టుమార్టంలో బయటపడ్డాయి. ఆమె ముఖం గోడకు వేసి కొట్టారు. ఆమె గొంతు నులిమి చంపారు.
ఆమె థైరాయిడ్ మృదులాస్థి విరిగిపోయింది.అద్దాలు పగిలిపోవడంతో ఆమె కంటికి గాయమైంది. ఆమె ప్రైవేట్ భాగాలను,జననేంద్రియాలను ఛిద్రం చేసిన గాయాలు ఉన్నాయి. ఆమె శరీరంలో 150 ఎంఎల్ వీర్యం ఉన్నట్లు గుర్తించారు. పోస్టుమార్టం నివేదిక ఒకరి వల్ల జరిగిన విషయం కాదని తెలియచేస్తున్నప్పటికీ కోల్‌కతా పోలీసులు ఒక వ్యక్తిని మాత్రమే బాధ్యుడిని చేశారు.వాస్తవ విషయాలను బయటకు రాకుండా చేస్తున్నారు.
ఈ ఘటనపై ఆందోళనతో షాక్‌కు గురయ్యారు. దీనికి బాధ్యత వహిస్తూ ప్రిన్సిపల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.అతను రాజీనామా చేసి, వెంటనే మరింత ప్రతిష్టాత్మకమైన రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రి- కలకత్తా మెడికల్ కాలేజీకి చీఫ్‌గా నియమించబడ్డాడు.రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వహిస్తుందా! లేదా ఇతర విషయాలు ఏమైనా దాగి ఉన్నాయా.
హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించేదే సీబీఐ. నేరం జరిగిన ప్రదేశంలో సాక్ష్యం లో కొంత భాగం ఇప్పటికే ఖచ్చితంగా నాశనం చేయబడింది.దానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తూ సమాధానం చెప్పాలి.
పశ్చిమ బెంగాల్‌లోని జూనియర్ డాక్టర్ల దృఢమైన శాంతియుత సామూహిక పోరాటం అఖిల భారత జూనియర్ డాక్టర్ల సమ్మెగా మారింది. బెంగాల్‌లో కాల్ ఫర్ జస్టిస్ ప్రజా ఉద్యమంగా రూపొందింది, వీధుల్లోకి మహిళలు పెద్ద ఎత్తున పోటెత్తారు.
మరిన్ని వార్తలకు....
* జొన్న రొట్టే వల్ల ఎన్ని లాభాలో తెలుసా ?తప్పక చదవండి !! ఇక్కడ క్లిక్ చేయండి
* గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో స్వల్ప మార్పు ? ఇక్కడ క్లిక్ చేయండి
* నేడు ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ ఇక్కడ క్లిక్ చేయండి
* అన్యాయాన్ని ఆపడానికి ప్రయత్నం చేసిన మహిళా జర్నలిస్టుకు హాండ్స్ అప్ ఇక్కడ క్లిక్ చేయండి
* డాక్టర్ ని ఆత్మ హత్యనా ? హత్యనా ? ఇక్కడ క్లిక్ చేయండి
* చిత్రహింసలు పెడ్తున్నాడని ఎస్ఐ పై ఫిర్యాదు చేసిన సంఘ నాయకులు ఇక్కడ క్లిక్ చేయండి
ఆర్జీకార్ వైద్యుల ధర్నాపై గూండాలు దాడి చేసి, ఎమర్జెన్సీని బద్దలు కొట్టి, రోగులను, వైద్యులను, నర్సులను కొట్టారు.ఈ గుంపును పోలీసులు నియంత్రించలేకపోయారని రాష్ట్ర ప్రభుత్వం నమ్మ పలుకుతుంది. ఇంత పెద్ద ఎత్తున జరిగిన సంఘటన పైన గుమి కూడుతున్నటువంటి జనం లో సంఘవిద్రోహ శక్తులు కూడా చేరుతాయని వారికి తెలియదా?
ఈ పోరాటంలో ఉన్న వైద్యులు తమ వీరోచిత సహోద్యోగికి అభయ అని పేరు పెట్టారు, ఆమెకు న్యాయం జరగాలి.ఆమె కొన్ని సంఘ విద్రోహ చర్యలకు సంబంధించిన రాకెట్‌ను బయటపెట్టింది,సాక్ష్యాలను రికార్డ్ చేయడానికి ఆమె చేసిన ప్రయత్నాలు చేయడం వల్లనే బలైందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అన్ని వాస్తవాలను వెలికి తీయాలి దోషులందరినీ శిక్షించాలి.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల మధ్య ఉన్న వైరుధ్యం వాస్తవాలను బయటకు తీయదు .అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు న్యాయమూర్తిచే కాల పరిమితి తో కూడిన న్యాయ విచారణ చేపట్టాలి.తద్వారా దోషులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.వీరోచిత డాక్టర్ అభయ కు న్యాయం చేయాలని డిమాండ్ తో పెద్ద సంఖ్యలో దేశంలో మహిళలంతా వీధుల్లేక వచ్చి ఆందోళనలో పాల్కొన్నారు.