వెన్ను చూపని వీరుడు సుభాష్ చంద్రబోస్
హైదరాబాద్ Hyderabad News భారత్ న్యూస్ ప్రతినిధి : నేడు సుభాష్ చంద్రబోస్ వర్ధంతి నాకు రక్తాన్ని ఇవ్వండి.. నేను మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను' అంటూ స్వతంత్ర భారతావని కోసం పోరాడిన కీర్తికిరీటం నేతాజీ సుభాష్ చంద్రబోస్.భారత్‌కు ఆయుధాలతో పోరాడటం తెలుసని ప్రపంచానికి చాటిచెప్పిన ధీశాలి. స్వేచ్ఛవాయువుల కోసం వీరమార్గంలోనూ బ్రిటీషర్లతో పోరాడుదామని పిలుపునిచ్చిన మహా వీరుడు.సాయుధపోరాటంతో స్వాతంత్య్రం వస్తుందని నమ్మి ఆచరణలో పెట్టిన యోధుడు, ఆ మహోన్నత శిఖరానికి ఇదే మా నివాళి.