సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి
Basheerabad News బషీరాబాద్ భారత్ ప్రతినిధి : రోజురోజుకు పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు, సైబర్నేరాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండి, తమ తల్లిదండ్రులకు, బంధువు లకు, స్నేహితులకు వివరించాలని బషీరాబాద్ ఎస్సై రమేష్ కుమార్ అన్నారు. బుదవారం మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ఆదర్ష పాఠశాల మరియు కళాశాల విద్యార్థులకు మహిళల భద్రత రక్షణ, సైబర్ క్రైమ్, ఆన్లైన్ మోసాలు తదితర అంశా లపై జిల్లా కళాబృందంచే అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై రమేష్ కుమార్ మాట్లాడుతూ.
మహిళలు, విద్యార్థినిల కోసమే షీ టీమ్స్ ఏర్పాటు చేశారని, విద్యార్థినిలు ఎటువంటి వేదింపులకు గురైనా వెంటనే 181 నెంబ రుకు కానీ, 100 నెంబరుకు కానీ ఫోన్ చేయాలన్నారు. అదేవిధంగా గ్రామాల్లో బాల్య వివాహాలు జరుపుతున్నట్లయితే 1098 చైల్డ్ లైన్ నెంబరుకు ఫోన్ చేసి సమా చారం ఇవ్వాలని తెలిపారు. సెల్ ఫోన్ వలన కలిగే అనార్థాలపై, విద్యార్థులు చెడు వ్యసనాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరియు పోక్సో చట్టం, ఈవ్ టీసింగ్, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ చట్టాలు, సైబర్ నేరాలు, సోషల్ మీడియా తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ అల్తమష్ జహంగీర్, ఉపాద్యాయ బృందం, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Bashirabad SSI Ramesh Kumar said that students should be aware of online frauds and cyberneras which are increasing day by day and explain to their parents, relatives and friends. An awareness conference was organized by the district art team on women's safety protection, cyber crime, online frauds and other issues for Telangana state ideal school and college students in Budavaram mandal center. SSI Ramesh Kumar spoke on this occasion.
She said that teams have been set up for women and students, and if they face any harassment, they should immediately call 181 or 100. Similarly, if child marriages are taking place in villages, they should call 1098 child line number and give information. On the harm caused by cell phone, precautions to be taken by students to avoid bad addiction and POCSO Act, eve teasing, road accidents, traffic laws, cyber crime, social media Awareness was given on other issues. School principal Altamash Jahangir, teaching team, police personnel and others participated in this program.