ఆస్పత్రిలో అన్న తమ్ముడికి రాఖీ కట్టి ప్రాణాలు వదిలిన చెల్లెలు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : రాఖీ పండుగ అనగానే అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముడు గుర్తొస్తారు. ఎన్ని గొడవలు పడ్డా ఎక్కడున్నా ఆ రోజు సోదరులకు రాఖీ కట్టి తమ ప్రేమానురాగాలను చాటుతారు. కష్టాలు వచ్చినా కన్నీళ్లు వచ్చినా ప్రాణాలున్నంత వరకు ఒకరినొకరు అండగా ఉంటామని చెప్పుకుంటారు. అది రక్తసంబంధానికి ఉన్న విలువ. అయితే కాసేపట్లోనే చనిపోతానని తెలిసిన ఓ సోదరి ఆస్పత్రిలోనే తన సోదరులకు రాఖీ కట్టి తుది శ్వాస విడిచింది. ఈ హృదయవిదారక ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండలంలో జరిగింది.
తాను బతుకుతానో లేదోనని చివరి సారిగా తన అన్న,తమ్ముడికి రాఖీ కట్టింది. రాఖీ కట్టిన కొన్ని గంటల్లోనే తుది శ్వాస విడిచింది. ఆస్పత్రి బెడ్ పై నుంచే రాఖీ కట్టిన ఈ వీడియో చూస్తే అందరినీ కలిచివేస్తోంది. చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి.
అసలేం జరిగిందంటే మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలానికి చెందిన ఓ సోదరి కోదాడలోని ఓ కళాశాలలో పాల్ టెక్నిక్ చదువుతోంది. ప్రేమ పేరుతో ఓ ఆకతాయి నిత్యం వేధిస్తుండటంతో మనస్తాపం చెందిన బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
గమనించిన బందువులు చికిత్స కోసం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే రాఖీ పండుగ వరకు బతుకుతానో లేదోనని శనివారం(ఆగస్టు 18న) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ బాలిక తన అన్నదమ్ముళ్లను పిలిచి బెడ్ పై నుంచే రాఖీ కట్టింది. తర్వాత కొన్ని గంటలకే తుది శ్వాస విడిచింది. నర్సింహుల పేట పోలీసులు ఆ ఆకతాయిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Anna's sisters and senior sister recall the celebration of Rakhi. Regardless of the number of fights that are right there, they show their adoration by tying rakhi to the siblings on that day. They say that they will remain by one another as long as they live, regardless assuming that there are troubles or tears. That is the worth of blood connection. In any case, a sister, who realize that she would kick the bucket soon, tied her sibling's rakhi in the clinic and died. This unfortunate occurrence occurred in Narsimhula Peta mandal of Mahabubabad locale.
Once and for all, she tied rakhi to her senior sibling and more youthful sibling to check whether she would make due or not. She died inside a couple of long periods of tying Rakhi. Watching this video of Rakhi from the clinic bed is making everybody chuckle. Tears are coming.
What really happened is that a sister from Narsimhulapeta mandal of Mahabubabad region was concentrating on Buddy procedure in a school in Kodada. For the sake of affection, a domineering jerk was continually badgering a young lady who was disturbed and serious self destruction by drinking insect poison.
The noticed detainees were moved to Mahabubabad Region Clinic for treatment. Be that as it may, on Saturday (August 18), the young lady who was going through treatment in the emergency clinic called her family and tied the rakhi from the bed to check whether she would make due till the Rakhi celebration. She died a couple of hours after the fact. The Narsimhul Peta police have enrolled a body of evidence against the whelp and are examining.