అక్టోబర్ 2న ఆకాశంలో అద్భుతం రింగ్ ఆఫ్ ఫైర్ సూర్యగ్రహణం
జాతీయ National News భారత్ ప్రతినిధి : అక్టోబర్ 2 న ఆకాశంలో మరో అద్భుత ఖగోళఘట్టం చోటుచేసుకో బోతోంది. అక్టోబర్ 2న 'రింగ్ ఆఫ్ ఫైర్' సూర్యగ్రహణం ఏర్పడనుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 9.13 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో మన దేశంలో రాత్రి కావడంతో గ్రహణం కనిపించదని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. పసిఫిక్ మహాసముద్రం, దక్షిణ చిలీ, దక్షిణ అర్జెంటీనాలోని కొన్ని ప్రాంతాలలో గ్రహణం కనిపిస్తుందని పేర్కొన్నారు.
జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం అక్టోబర్ 2 న సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఆ రోజు మహాలయ అమావాస్య అంటే పితృపక్షం రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సాధారణంగా అమావాస్య అంటేనే పెద్లలకు తర్పణాలు వదులుతారు. ఆ రోజు ( అక్టోబర్ 2 న ) వరకు 15 రోజుల పాటు భూమిపై సంచరించిన పెద్దలు భూమికి వీడ్కోలు పలికి వారి గమ్య స్థానాలకు వెళతారని గరుడపురాణం ద్వారా తెలుస్తుంది. అక్టోబర్ 2న ఏర్పడే సూర్యగ్రహణం ప్రతికూలమని పండితులు చుబుతున్నారు. ఈ కాలంలో ప్రతి వ్యక్తి జాగ్రత్తగా ఉండాలంటున్నారు.
On October 2, another amazing celestial event is going to take place in the sky. Astronomers have revealed that a 'Ring of Fire' solar eclipse will occur on October 2. The solar eclipse will begin at 9.13 pm Indian time. Astronomers have revealed that the eclipse will not be visible as it is night in our country at that time. The eclipse is said to be visible in parts of the Pacific Ocean, southern Chile and southern Argentina.
According to astrologers, a solar eclipse will occur on October 2. On that day Mahalaya Amavasya means. Solar eclipse will occur on Pitrupaksha day. It is known from Garudapurana that elders who have roamed the earth for 15 days till that day (October 2) say goodbye to the earth and go to their destination. Pundits say that the solar eclipse on October 2 is negative. Every person needs to be careful during this period.