Type Here to Get Search Results !

Sports Ad

డీఎస్సీ-2008 అభ్యర్థులకు కొలువులు Measurements for DSC-2008 Candidates

 డీఎస్సీ-2008 అభ్యర్థులకు కొలువులు

*  అక్టోబర్‌ 4వరకు సర్టిఫికెట్ల పరిశీలన 
*  మెరిట్‌ జాబితాలో పలువురి పేర్లు గల్లంతు 
* కలెక్టర్‌, డీఈవోలకు ఫిర్యాదు
* ఆందోళనలో అభ్యర్థులు

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : అధికారులు, ప్రజాప్రతినిధులు, కోర్టుల చుట్టూ తిరుగుతూ సుదీర్ఘ పోరాటం చేసిన డీఎస్సీ-2008 అభ్యర్థుల కల ఎట్టకేలకు సాకారం కానుంది.ఓవైపు న్యాయపోరాటం, మరోవైపు ప్రభుత్వాలను న్యాయం కోసం వేడుకుంటూ ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్న వారి పోరాటానికి ప్రతిఫలం దక్కనుంది. దీనితో ఆనాడు నిర్వహించిన డీఎస్సీ-2008లో పరీక్షలు రాసి కామన్‌మెరిట్‌లో క్వాలిఫై అయి నష్టపోయిన 30శాతం బీఎడ్‌ అభ్యర్థులు సంతోషంలో మునిగితేలుతున్నారు. అయితే అధికారుల నిర్లక్ష్యమో  లేక తప్పిదమో కానీ దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించినా జిల్లా విద్యాశాఖ అధికారులు రూపొందించిన మెరిట్‌ జాబితాలో వారి పేర్లు కనిపించక పోవడంతో కొంత మంది అభ్యర్థులు ఉద్యోగం చేజారిపోతుందనే ఆందోళనతో కొట్టుమిట్టాడుతున్నారు. 2008లో బీఎడ్‌ క్వాలిఫికేషన్‌తో డీఎస్సీ పరీక్షలు రాసి కామన్‌ మెరిట్‌లో సెలక్టు అయిన వారందరికీ అప్పుడే ఉద్యోగాలివ్వాల్సి ఉండగా తమకు ఉద్యోగాలివ్వకుండా అన్యాయం చేశారని, తమకు నష్టం జరిగిందంటూ అప్పటి నుంచే మెరిట్‌లో సెలక్టు అయిన అభ్యర్థులు పోరాటం ప్రారంభించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో బీఎడ్‌తో డీఎస్సీ రాసి ఉద్యోగాలు రానివారు 200లకు పైగా అభ్యర్థులుండగా, ఆ తర్వాత నిర్వహించిన డీఎస్సీలో కొందరు పరీక్షలు రాసి ఉద్యోగాలు పొందారు. అయితే ఇప్పటికీ ఇంచుమించు 200 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు రాలేదని నష్టపోయిన అభ్యర్థులు చెబుతున్నారు.

    రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు విధానంలో వీరందరికీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు మెరిట్‌ జాబితాను ప్రకటించి, సర్టిఫికెట్ల పరిశీలన చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనితో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంతో పాటు వెబ్‌సైట్‌లో శుక్రవారం మెరిట్‌ జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలోని అభ్యర్థులు అక్టోబర్‌ 4వ తేదీ వరకు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్టిఫికెట్లను పరిశీలన చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి సీహెచ్‌వీఎస్‌ జనార్ధన్‌రావు సూచించారు. అయితే ఈ జాబితా పూర్తిగా తప్పుడు తడకలుగా ఉందని, ఉద్యోగాలు వచ్చిన వారి పేర్లను కూడా చేర్చారని, కామన్‌ మెరిట్‌ లిస్ట్‌లో ఎంపికైన వారి పేర్లను చేర్చలేదంటూ పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. తమలాగే దాదాపు 15 మంది అభ్యర్థుల పేర్లను మెరిట్‌ లిస్ట్‌లో చేర్చలేదని, దీనిపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరుతూ నష్టపోయిన సెలెక్టెడ్‌ బీఎడ్‌ అభ్యర్థులు వై.వేణుగోపాల్‌, ఎస్‌.రాజిరెడ్డి జిల్లా కలెక్టర్‌, జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం సమర్పించామని తెలిపారు. దాదాపు 15ఏళ్లుగా చేస్తున్న పోరాటంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలివ్వాలని ఆదేశిస్తే తమకు అధికారులు నష్టం చేసే విధంగా మెరిట్‌ జాబితాను తప్పుల తడకగా తయారు చేశారని, ఉద్యోగం వస్తుందనే తమ ఆశలను అడియాశలు కాకుండా కాపాడాలని అధికారులను కోరుతున్నారు.

The dream of the DSC-2008 candidates, who have been fighting for a long time by going around the officials, public representatives and courts, will finally come true.With this, 30 percent of the B.D. candidates who wrote the exams in DSC-2008 and qualified in common merit are drowning in happiness. But whether it is the negligence or mistake of the officials, but God blesses, the priest has no mercy, even if the state government orders him to give a job.Whether it is carelessness or mistake, but God has blessed them and the priest has no mercy, even if the state government has ordered them to give them a job, some candidates are worried that their names will not appear in the merit list prepared by the district education department officials In 2008, all those who wrote DSC exams with BED qualification and were selected in common merit started the struggle since then, all the candidates who were selected in merit started the fight saying that they were wronged by not being given jobs. DSC written with BED in combined Karimnagar district While there are more than 200 candidates who did not get jobs, some of them got jobs after appearing in the DSC conducted afterwards. But still about 200 candidates have not got jobs, said the losing candidates.

   The state government has issued orders to announce the merit list and examine the certificates to fill the teacher posts under the contract system. With this, the merit list will be released on Friday in the office of the District Education Officer as well as on the website did District Education Officer CHVS Janardhan Rao suggested that the candidates in this list should examine the certificates from 10.30 am to 5 pm at the District Education Officer's office till October 4. But many candidates complain that this list is completely false and names of those who have got jobs are also included and names of those selected in the common merit list are not included. Merit the names of about 15 candidates like themselves They said that they have submitted a petition to the district collector and district education officer Y. Venugopal, S. Rajireddy of the selected BED candidates who were not included in the list and wanted to investigate and do justice to them. With almost 15 years of struggle If the Chief Minister of the State Revanth Reddy orders them to get employment on contract basis, the merit list has been prepared in such a way that it will cause them loss and they are asking the officials to protect their hopes of getting a job.

మరిన్ని వార్తల కోసం....
* నెల రోజుల్లో ఫ్యామిలీ డిజిటల్‌ హెల్త్‌ కార్డులు ఇక్కడ క్లిక్ చేయండి
* డీఎస్సీ-2008 అభ్యర్థులకు కొలువులు ఇక్కడ క్లిక్ చేయండి
* హైడ్రా కమిషనర్‎కు హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇక్కడ క్లిక్ చేయండి
* సామాన్యులకు బిగ్ షాక్ భారీగా పెరిగిన ధరలు ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies