Type Here to Get Search Results !

Sports Ad

నెల రోజుల్లో ఫ్యామిలీ డిజిటల్‌ హెల్త్‌ కార్డులు Family digital health cards within a month

 నెల రోజుల్లో ఫ్యామిలీ డిజిటల్‌ హెల్త్‌ కార్డులు

* దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ రెనోవా క్యాన్సర్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో సీఎం 

హైదరాబాద్‌ Hyderabad News భారత్ ప్రతినిధి : నెల రోజుల్లో రాష్ట్రంలో ఫ్యామిలీ డిజిటల్‌ హెల్త్‌ కార్డుల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ప్రతి గ్రామంలో ఇంటింటా సర్వే చేసి వ్యక్తిగత ఆరోగ్య ప్రొఫైల్‌ రూపొందిస్తామని చెప్పారు. హైదరాబాద్‌ విద్యానగర్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ రెనోవా క్యాన్సర్‌ సెంటర్‌ను గురువారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ఆంధ్ర మహిళా సభ ఆధ్వర్యంలోని దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ ఆసుపత్రిలో కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద క్యాన్సర్‌ సేవలను అందుబాటులోకి తేవడం గొప్ప విషయం. ప్రస్తుతం యువతతోపాటు వృద్ధుల జనాభా అధికమవుతోంది. అందుకు అనుగుణంగా ముందస్తు ఆలోచనలతో ప్రణాళికలు సిద్ధం చేసుకొని ప్రతి ఒక్కరికీ వైద్యసేవలు అందించాల్సి ఉంది. 

     అందుకే అందరి హెల్త్‌ ప్రొఫైల్స్‌ తయారు చేస్తున్నాం. 30 రోజుల లోపు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నాం. ఇందుకోసం దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ లాంటి ఆసుపత్రులు, ఎన్‌జీవోల సహకారం తీసుకుంటాం. ఈ సంస్థలతో ఆరోగ్యశాఖ మంత్రి సమావేశమై దీనిపై కూలంకషంగా చర్చిస్తారు’అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ ప్రస్తుతం జీవనశైలి వ్యాధులు పెరుగుతున్నాయని, వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ ట్రస్టు లైఫ్‌ ట్రస్టీ, ఐఏఎస్‌ మాజీ అధికారి ఐవైఆర్‌ కృష్ణారావు, ఆంధ్ర మహిళాసభ అధ్యక్షురాలు లక్ష్మి, దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ మహిళాసభ ఛైర్మన్‌ ఎస్వీ రావు, రెనోవా ఆసుపత్రి ఛైర్మన్‌ వి.కె.శాస్త్రి, ఎండీ శ్రీధర్‌ పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Chief Minister Revanth Reddy started the process of family digital health cards in the state within a month. He said that a house-to-house survey was conducted in each village and a personal health profile was created.Durgabai Deshmukh Renova Cancer Center in Vidyanagar, Hyderabad was inaugurated on Thursday along with Health Minister Damodar Rajanarsimha. CM spoke on this occasion.It is a great thing that cancer services are made available under corporate social responsibility at Durgabai Deshmukh Hospital under the auspices of Andhra Mahila Sabha. Currently, the population of the elderly is increasing along with the youth.Accordingly, plans should be prepared with advance thoughts and medical services should be provided to everyone. That is why we are making health profiles for everyone. 

     We will launch this program within 30 days.For this we will take the cooperation of hospitals like Durgabai Deshmukh and NGOs. The Health Minister will hold a meeting with these organizations and discuss it thoroughly.CM Revanth Reddy said. Minister Rajanarsimha said that currently lifestyle diseases are increasing and it is the responsibility of all of us to make people aware about them.Government advisor Shabbir Ali, former MP V. Hanumantha Rao, Life Trustee of Durgabai Deshmukh Trust, former IAS officer IVIR were present in the program.Krishna Rao, Andhra Mahila Sabha President Lakshmi, Durgabai Deshmukh Mahila Sabha Chairman SV Rao, Renova Hospital Chairman VK Shastri, MD Sridhar Peddireddy and others participated.

మరిన్ని వార్తల కోసం....
* నెల రోజుల్లో ఫ్యామిలీ డిజిటల్‌ హెల్త్‌ కార్డులు ఇక్కడ క్లిక్ చేయండి
* డీఎస్సీ-2008 అభ్యర్థులకు కొలువులు ఇక్కడ క్లిక్ చేయండి
* హైడ్రా కమిషనర్‎కు హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇక్కడ క్లిక్ చేయండి
* సామాన్యులకు బిగ్ షాక్ భారీగా పెరిగిన ధరలు ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies