Type Here to Get Search Results !

Sports Ad

గ్రూప్‌–1 మెయిన్స్ ఎగ్జామ్స్కు లైన్ క్లియర్ అప్పీల్‌ పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు Line Clear For Group-1 Mains Exams High Court Dismisses Appeal Petitions

గ్రూప్‌–1 మెయిన్స్ ఎగ్జామ్స్కు లైన్ క్లియర్ అప్పీల్‌ పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ రద్దుకు నిరాకరిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. దీంతో గ్రూప్‌–1 ఎగ్జామ్స్కు లైన్ క్లియర్ అయింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. చివరి నిమిషంలో పరీక్ష రద్దు సాధ్యం కాదని హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. 8 మంది పిటిషనర్ల కోసం లక్షల మంది ఎందుకు ఇబ్బంది పడాలని ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పటికే పరీక్ష రెండుసార్లు రద్దయిందని గుర్తుచేసింది. పరీక్షల కోసం ఎంతోమంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని, పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

 ఈ నెల (అక్టోబర్, 2024) 21 నుంచి గ్రూప్1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 27 వరకూ పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. వీరి కోసం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్  జిల్లాల్లో 46 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో 8, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్  మల్కాజిగిరి జిల్లాలో 27  పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు. ప్రతి పరీక్ష కేంద్రంలోనూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 

 టీజీపీఎస్సీ ఆఫీసులో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా పరీక్షల తీరును అధికారులు పర్యవేక్షించనున్నారు. మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే 85 శాతం అభ్యర్థులు తమ హాల్ టికెట్లను  డౌన్లోడ్  చేసుకున్నారని తెలిపారు. వికలాంగులకు ఒక గంట అదనంగా కేటాయిస్తామని అధికారులు చెప్పారు.

The High Court has dismissed the appeal petitions filed challenging the judgment given by the single judge refusing to cancel Group-1 prelims. With this the line for Group-1 Exams has been cleared. The judgment of the single bench was upheld by the Division Bench of the High Court. The Division Bench of the High Court made important comments that the examination cannot be canceled at the last minute. The bench asked why lakhs of people should suffer for 8 petitioners. Reminded that the exam has already been canceled twice. The High Court has made it clear that there are many unemployed people waiting for the exams and no orders can be given to postpone the exams.

 Group 1 Mains Exams will start from 21st of this month (October, 2024). Exams will be held till 27th. 31,383 candidates are appearing for Group-1 Mains Exams. For them, 46 examination centers have been set up in Hyderabad, Rangareddy and Medchal districts. Officials revealed that 8 examination centers have been set up in Hyderabad, 11 in Rangareddy district and 27 in Medchal Malkajigiri district. CCTV cameras have been installed in every examination center. 

 The officials will monitor the conduct of the exams through the control room set up in the TGPSC office. It has been clarified that candidates will not be allowed to enter the examination center after half past one in the afternoon. He said that 85 percent of the candidates have already downloaded their hall tickets. Officials said that one hour will be allotted to the disabled.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies