గ్రూప్ 1 అభ్యర్థుల డిమాండ్లు ఇవే ఆందోళనకు కారణాలు ఇవే
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : అక్టోబర్21నుంచి జరగనున్న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. నిన్న అశోక్ నగర్ చౌరస్తాలో ఆందోళనకు దిగిన అభ్యర్థులు పరీక్షల నిర్వహణపై చర్చించేందుకు ఇవాళ( గురువారం ( అక్టోబర్ 17) హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ తో భేటీ అయ్యారు.
* గ్రూప్స్ 1 అభ్యర్థుల డిమాండ్లు
* GO 29 రద్దు చేసి పరీక్షలు నిర్వహించాలి.
* పాత G.O.55 ప్రకారం పరీక్షల నిర్వహణ జరగాలి.
* పాత నోటిఫికేషన్లో ఇచ్చిన 503 పోస్ట్లలో కొత్త అభ్యర్థులకు అవకాశం ఇవ్వవద్దు.
* పెంచిన 60 పోస్టుల్లో మాత్రమే కొత్తగా అప్లై చేసుకున్న వారికి అవకాశం ఇవ్వాలి.
* (ప్రభుత్వం కొత్తగా 503 పోస్ట్ ల్లో60 పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇచ్చింది)
* Go 29 , రిజర్వేషన్ల అంశాల్లో కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నాయి. వాటిని పరిష్కరించి పరీక్షలు పెట్టాలి,
* పాత నోటిఫికేషన్ ప్రకారమే రిజర్వేషన్లు, ఓపెన్ క్యాటగిరి ప్రకారం పరీక్షలు ఉండాలి.
Group 1 candidates are agitating demanding postponement of Group 1 Mains exams to be held from October 21. The candidates who protested at Ashok Nagar Square yesterday met the PCC chief at Gandhi Bhavan in Hyderabad today (Thursday (October 17)) to discuss the conduct of the examinations.