రూ.10 నాణేలపై ఇండియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ కీలక ప్రకటన
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : రూ.10 నాణేలు చట్టబద్ధమైనవని, వీటిని రోజువారీ లావాదేవీలకు ఉపయోగించవచ్చని ఇండియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి అన్నారు. వీటి చలామణిని వ్యాపార లావాదేవీలకు ఉపయోగించాలని , ఆర్బీఐ ఉత్తర్వుల మేరకు విస్తృత అవగాహన కల్పించేందుకు ఇండియన్ బ్యాంక్ చర్యలు చేపడుతోందని వివరించారు.
హైదరాబాద్ హిమాయత్ నగర్ బ్రాంచ్ వద్ద 10 రూపాయల నాణేలు చలామణిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తమ ఖాతాదారులకు 10 రూపాయల నాణేలు వినియోగించాలని సూచిస్తున్నామని ఇప్పటికే ఆర్టీసీ బస్సులలో ఈ నాణేలు చెల్లుబాటు అవుతున్నాయన్నారు. ఈ సందర్భంగా పలువురు ఖాతాదారులు ఈ నాణేలను జీఎం చేతుల మీదుగా అందుకున్నారు.