టీమిండియా ప్లేయింగ్ 11లో మయాంక్ నితీష్ లక్నో,సన్‌రైజర్స్ జట్లకు బిగ్ షాక్
జాతీయ National News భారత్ ప్రతినిధి : ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ కు ముందు లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు యువ ప్లేయర్లు మయాంక్ యాదవ్, నితీష్ రెడ్డి భారత్ తరపున అరంగేట్రం చేశారు. ఆదివారం (అక్టోబర్ 6) గ్వాలియర్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో ప్లేయింగ్ లో వీరికి చోటు దక్కింది. దీంతో వారు ఈ ఇద్దరిని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లుగా రిటైన్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది.
2025 మెగా ఆక్షన్ కు ముందు ప్రకటించిన రూల్స్ ప్రకారం అక్టోబర్ 31 లోపు అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆటగాడు క్యాప్డ్ ప్లేయర్‌గా పరిగణించబడతాడు. లక్నో సూపర్ జెయింట్స్ కు మయాంక్ యాదవ్ ఆడుతున్నాడు. 2024 ఐపీఎల్ సీజన్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. స్టార్ ఆటగాళ్లు సైతం ఈ యువ బౌలర్ ను ఆడలేక చేతులెత్తేశారు. దీంతో ఈ సారి అతన్ని అన్‌క్యాప్డ్ ప్లేయర్ గా తీసుకోవాలని లక్నో భావించింది. అన్‌క్యాప్డ్ ప్లేయర్ గా తీసుకుంటే వారికి రూ. 4 కోట్లు ఇచ్చినా సరిపోతుంది. ఇప్పుడు అవకాశం లేకపోవడంతో మయాంక్ ను రిటైన్ చేసుకోవాలంటే కనీసం రూ. 11 కోట్ల రూపాయలు లేదా అంతకన్నా ఎక్కువగా చెల్లించాల్సిందే.
మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ నితీష్ కుమార్ రెడ్డిది ఇదే పరిస్థితి. ఈ యువ ప్లేయర్ 2024 ఐపీఎల్ సీజన్ లో ఆల్ రౌండర్ గా సత్తా చాటాడు. దీంతో సన్ రైజర్స్ అతన్ని అన్‌క్యాప్డ్ ప్లేయర్ కేటగిరిలో తీసుకోవాలనే ఆలోచనలో ఉంది. నితీష్ కూడా అంతర్జాతీయ అరంగేట్రం చేయడంతో సన్ రైజర్స్ కు నిరాశ తప్పలేదు. దీంతో ఈ యువ ఆల్ రౌండర్ ను రిటైన్ చేసుకోవాలంటే కనీసం రూ. 11 కోట్లు లేదా అంతకన్నా ఎక్కువగా చెల్లించాల్సిందే. మయాంక్ తన తొలి మ్యాచ్ లో నాలుగుకు ఓవర్లలో 21 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. మరోవైపు నితీష్ 16 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
Before the IPL 2025 Mega Action, Lucknow Super Giants and Sunrisers Hyderabad teams got an unexpected shock. The team's young players Mayank Yadav and Nitish Reddy made their debut for India. They got a place in playing in the first T20 match held at Gwalior on Sunday (October 6). This made it impossible for them to retain these two as uncapped players. As per the rules announced before the 2025 Mega Action, a player who has made his international debut before October 31 will be considered a capped player.
Mayank Yadav plays for Lucknow Super Giants. He bowled brilliantly in the 2024 IPL season. Even the star players could not play this young bowler and gave up. This time, Lucknow decided to take him as an uncapped player. If taken as an uncapped player, they will get Rs. 4 crores is enough. Now that there is no chance to retain Mayank, at least Rs. 11 crores or more to be paid.
On the other hand, Sunrisers Hyderabad's Nitish Kumar Reddy is in the same situation. This young player has shown his potential as an all-rounder in the 2024 IPL season. With this, Sunrisers is thinking of taking him in the uncapped player category. With Nitish also making his international debut, Sunrisers were not disappointed. With this, to retain this young all-rounder, at least Rs. 11 crores or more to be paid. Mayank scored 21 runs in four overs and took one wicket in his first match. On the other hand, Nitish scored 16 runs and remained unbeaten.