అక్టోబర్2 నుంచి దసరా సెలవులు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : పాఠశాలకు దసరా సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ విద్యాశాఖ. బతుకమ్మ, దసరా పండుగల ఉన్నందున తెలంగాణలో అక్టోబర్ 2నుంచి 14వ తేదీవరకు విద్యార్థులకు దసరా సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశాలిచ్చారు. అక్టోబర్ 15న పాఠశాలలు పునప్రారంభం అవుతాయి.
విద్యాశాఖ ఆదేశాలు పాటించకుండా స్కూళ్ల నడిపితే ప్రైవేట్ స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు చెప్పారు.ఇవాళ(అక్టోబర్ 1న) పాఠశాలల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ నిర్వహించారు. కాగా తెలంగాణలోని అన్ని కాళేజీలకు అక్టోబర్ 6 నుంచి దసరా సెలవులు ప్రకటించారు.
Telangana Education Department has issued an order declaring Dussehra holidays for schools. Due to Bathukamma and Dasara festivals, Dussehra holidays have been declared for students from October 2 to 14 in Telangana. The director of school education has ordered to give holidays to private schools as well as government schools. Schools will resume on October 15.
The education department officials said that strict action will be taken against the private schools if the schools are run without following the instructions of the education department. Bathukamma celebrations were organized in schools today (October 1). Dussehra holidays have been announced for all the colleges in Telangana from October 6.