Type Here to Get Search Results !

Sports Ad

నేటి నుంచి విమెన్స్ టీ20 వరల్డ్ కప్ టీమిండియా షెడ్యూల్ ఇదే This Is The Women's T20 World Cup Team India Schedule From Today

నేటి నుంచి విమెన్స్ టీ20 వరల్డ్ కప్ టీమిండియా షెడ్యూల్ ఇదే

జాతీయ National News భారత్ ప్రతినిధి : మహిళల పొట్టి ప్రపంచకప్‌ పోరుకు సమయం ఆసన్నమైంది. గురువారం(అక్టోబర్ 03) నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. యూఏఈ వేదికగా జరుగుతున్న ఈ మెగాటోర్నీలో మొత్తం 10 జట్లు తలపడబోతున్నాయి. అభిమానులను మునివేళ్లపై నిలబెడుతూ బౌండరీలు చిన్నబోయేలా అమ్మాయిలు అదరగొట్టేందుకు సర్వశక్తులు ఒడ్డనున్నారు.

10 జట్లు రెండు గ్రూపులు....
ఈ మెగా టోర్నీ 19 రోజుల పాటు అభిమానులను అలరించనుంది. సెమీస్‌ ఫైనళ్లు, ఫైనల్‌ సహా మొత్తం 23 మ్యాచ్‌లు జరగనున్నాయి. దుబాయ్‌, షార్జా వేదికలు ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి. టోర్నీలో పాల్గొంటున్న 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌ దశలో ఒక్కో జట్టు గ్రూపులోని మరో జట్టుతో ఒక మ్యాచ్‌ (మొత్తం నాలుగు) చొప్పున ఆడనుంది. ఈ మ్యాచ్ లు ముగిసేనాటికి గ్రూప్‌ దశలో టాప్‌-2లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్‌ 17, 18న సెమీస్‌ లు, 20న ఫైనల్‌ జరగనుంది.

గ్రూప్‌- ఏ: భారత్‌,పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, శ్రీలంక
గ్రూప్‌- బీ: ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, స్కాట్లాండ్‌
టీమిండియా షెడ్యూల్
అక్టోబర్‌ 04: భారత్‌ vs న్యూజిలాండ్‌ (దుబాయ్‌, రాత్రి 7:30 గంటలకు)
అక్టోబర్‌ 06: భారత్‌ vs పాకిస్థాన్‌ (దుబాయ్‌, మధ్యాహ్నం 3:30 గంటలకు)
అక్టోబర్‌ 09: భారత్‌ vs శ్రీలంక (దుబాయ్‌, రాత్రి 7:30 గంటలకు)
అక్టోబర్‌ 13: భారత్‌ vs ఆస్ట్రేలియా (షార్జా, రాత్రి 7:30 గంటలకు)
లైవ్ స్ట్రీమింగ్: మహిళల టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు మన దేశంలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి. డిజిటల్ గా డిస్నీ+ హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ ఆస్వాదించవచ్చు.
భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దయాళన్ హేమలత,  షఫాలీ వర్మ, దీప్తి శర్మ, రిచా ఘోష్, యాస్తిక భాటియా, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, రాధా యాదవ్, ఆశా శోభన, ఎస్. సజన, శ్రేయాంక పాటిల్.

The time has come for the women's short World Cup. This tournament will start from Thursday (October 03). A total of 10 teams are going to compete in this mega tournament which is being held in the UAE. Keeping the fans on their toes, the girls will do their best to make the boundaries smaller.

 This mega tournament will entertain the fans for 19 days. A total of 23 matches including semi finals and final will be played. Dubai and Sharjah venues will host these matches. The 10 teams participating in the tournament are divided into two groups. In the group stage, each team plays one match against the other team in the group.

మరిన్ని వార్తల కోసం.... 
* దారుణం ట్రీట్‌మెంట్ కోసం వచ్చి డాక్టర్‪ను కాల్చి చంపారు ఇక్కడ క్లిక్ చేయండి
* జానీకి మధ్యంతర బెయిల్ జాతీయ అవార్డు తీసుకోవటానికి అంట ఇక్కడ క్లిక్ చేయండి
* పండగ ముందు బంగారం ధర పరుగులు భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు ఇక్కడ క్లిక్ చేయండి
* మీకు షుగర్ ఉందా అయితే రాత్రి పూట పాలలో వీటిని కలుపుకుని తాగండి ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies