ఢిల్లీలో 2000 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
ఢిల్లీ Delhi News భారత్ న్యూస్ ప్రతినిధి : దేశరాజధాని ఢిల్లీలో బుధవారం భారీగా డ్రగ్స్ పట్టుబడడంతో కలకలం రేగింది,ఢిల్లీలో ఈరోజు మధ్యాహ్నం 565 కిలోల కోకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ దాదాపు 2వేల కోట్ల ఉండ వచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్ తో సంబంధం ఉన్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ భారీ కొకైన్ రవాణా వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ సిండికేట్ హస్తం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
National capital Delhi was in a frenzy on Wednesday after a massive drug bust, with police seizing 565 kg of cocaine this afternoon. Officials estimate the value of the seized drugs to be around 2,000 crores.In this order, the police arrested four people who were related to drugs. The police suspect that an international drug smuggling syndicate is behind this huge cocaine shipment.