Type Here to Get Search Results !

Sports Ad

తెలంగాణలో పడిపోతున్నఎయిర్ క్వాలిటీ ఈ 23 జిల్లాల్లో యమ డేంజర్ Falling Air Quality In Telangana Is A Danger In These 23 Districts

తెలంగాణలో పడిపోతున్నఎయిర్ క్వాలిటీ ఈ 23 జిల్లాల్లో యమ డేంజర్

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణలో గాలి నాణ్యత దెబ్బతింటున్నది. ఒకటి, రెండు సిటీల్లో కాదు దాదాపు అన్ని ప్రధాన పట్టణాల్లోనూ ఎయిర్ క్వాలిటీ పడిపోతున్నది. సిటీల పరిధి విస్తరిస్తుండడం, నిర్మాణాలు, వాహనాలు, పరిశ్రమలు పెరిగిపోతుండడం వంటి కారణాలతో వాయు కాలుష్యం ఎక్కువైపోతున్నది. ఫలితంగా గాలిలో కాలుష్య కారకాలైన పార్టిక్యులేట్​మ్యాటర్​(పీఎం) 2.5, పీఎం 10 స్థాయిలు పెరుగుతున్నాయి.

ఆ జిల్లాల్లో 100కు పైనే...
రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ఎయిర్​క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) వందకు పైగానే నమోదవుతున్నది. వరంగల్, హనుమకొండలో హైదరాబాద్​కు మించి ఏక్యూఐ నమోదవడం ఆందోళన కలిగిస్తున్నది. వరంగల్​లో అత్యధికంగా ఏక్యూఐ 143 ఉండగా, పీఎం 2.5 స్థాయిలు క్యూబిక్ మీటర్ గాలిలో 59 మైక్రోగ్రాముల మేర ఉన్నట్టు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఏడాదిలో ఏక్యూఐ సగటు 120గా ఉండగా, దాదాపు 180 రోజుల పాటు అదే స్థాయిలో ఏక్యూఐ నమోదవుతున్నది.  హనుమకొండలో ఏక్యూఐ 130 ఉండగా, పీఎం 2.5 స్థాయిలు క్యూబిక్ మీటర్​ గాలిలో 48 మైక్రోగ్రాముల మేర ఉన్నాయి. ఏడాదిలో ఏక్యూఐ సగటు 116గా, 179 రోజుల పాటు అంతే స్థాయిలో ఏక్యూఐ రికార్డ్​అయింది. 

 ఇక హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్​వంటి జిల్లాల్లోనూ ఏక్యూఐ 110 కన్నా ఎక్కువగానే ఉంటున్నది. హైదరాబాద్​సిటీలో ఏక్యూఐ 128 ఉండగా, పీఎం 2.5 స్థాయిలు 46 గ్రాముల మేర ఉంటున్నాయి. ఏడాదిలో 166 రోజుల పాటు గాలి నాణ్యత అత్యంత తక్కువగా ఉంటున్నట్టు తేలింది. హైదరాబాద్​సిటీ పరిధిలోని సనత్​నగర్​లో 125, రాజేంద్రనగర్​లో 124, మేడ్చల్​లో 120, జీడిమెట్లలో 116, పటాన్​చెరులో 114 మేర ఏక్యూఐ నమోదవుతున్నట్టు తేలింది. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies