ఇంటర్ పాసైతే చాలు రైల్వేలో 3 వేల 445 ఉద్యోగాలకు నోటిఫికేషన్
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఇండియన్ రైల్వే, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 3,445 ఖాళీలను భర్తీకీ సంబంధించిన నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (అండర్ గ్రాడ్యుయేట్) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
పోస్టులు–ఖాళీలు: మొత్తం 3,445 పోస్టుల్లో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 2,022, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 361, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 990, ట్రైన్స్ క్లర్క్: 72 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
అర్హత: కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్/ ట్రైన్స్ క్లర్క్ పోస్టులకు కనీసం 50 శాతం మాక్కులతో 12వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్/ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కనీసం 50 శాతం మాక్కులతో 12వ తరగతి ఉత్తీర్ణత. వయసు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (టైర్-1, టైర్-2), స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అక్టోబర్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250 చెల్లించాలి. పూర్తి వివరాలకు www.rrbapply.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.