Type Here to Get Search Results !

Sports Ad

దీపావళి పండుగ ఏ తేదీన జరుపుకోవాలి అక్టోబర్ 31న లేక నవంబర్ ఒకటినా పండితులు ఏం చెబుతున్నారు On Which Date Should Diwali Festival Be Celebrated 31st October Or 1st November What Do The Scholars Say

దీపావళి పండుగ ఏ తేదీన జరుపుకోవాలి అక్టోబర్ 31న లేక నవంబర్ ఒకటినా పండితులు ఏం చెబుతున్నారు

జాతీయ National News భారత్ ప్రతినిధి : హిందువులు దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు. చీకట్లను తొలగించి వెలుగు నింపే దీపావళి పండుగ ఎప్పుడు నిర్వహించుకోవాలనేదానిపై స్పష్టత లేదు. కొంత మంది పండితులు అక్టోబర్ 31న  పండుగ జరుపుకోవాలని చెబుతున్నారు. మరికొందరు నవంబర్ 1న పండుగ జరుపుకోవాలని చెబుతున్నారు. దీంతో ప్రజలు దీపావళి ఎప్పుడు జరుపుకోవాలని ఆయోమయంలో పడిపోయారు.  పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది (2024) ఏరోజు జరుపుకోవాలో తెలుసుకుందాం.  

 సాధారణంగా దీపావళి   పండుగ ప్రతి సంవత్సరం అశ్వయుజ మాసంలో అమావాస్య రోజు జరుపుకుంటారు. ఆ రోజు చాలా మంది కేదారేశ్వర స్వామి నోములు నోచుకుంటారు. ఈ ఏడాది( 2024) ప్రదోష అమావాస్య అక్టోబర్ 31 న మొదలై  పాటు నవంబర్ 1వరకు  ఉందని చెబుతున్నారు. దీంతో   దీపావళి ఎప్పుడు జరుపుకోవాలని అయ్యగార్లను భక్తులు అడుగుతున్నారు. వేద క్యాలెండర్ ప్రకారం ( తెలుగు రాష్టాల్లో) అక్టోబర్ 31 మధ్యాహ్నం 3 గంటల 52 నిమిషాలకు అమావాస్య మొదలు అవుతుంది. ఈ అమావాస్య నవంబర్ 1 సాయంత్రం6గంటల 16  నిమిషాలకు ముగుస్తుంది. ఆ వెంటనే పాడ్యమి మొదలవుతుంది. దీంతో అక్టోబర్ 31న పండుగ జరుపుకోవాలని పలువురు పండితులు చెబుతున్నారు.

దీపావళి 2024 తేదీ:
పూజ సమయాలు
లక్ష్మీ పూజ ముహూర్తం : అక్టోబర్ 31, 2024న సాయంత్రం 05:36 నుండి 06:16 వరకు (వ్యవధి: 41 నిమిషాలు)
అమావాస్య తిథి ప్రారంభం: అక్టోబర్ 31, 2024న మధ్యాహ్నం 03:52
అమావాస్య తిథి ముగుస్తుంది: నవంబర్ 01, 2024న సాయంత్రం 06:16 గంటలకు.

ధృక్​ పంచాంగం ప్రకారం కొన్ని ప్రాంతాల్లో దీపావళి వేడుకలు  నవంబర్​ 1 వతేదీన జరుపుకుంటారు. ధృక్​ పంచాగం ప్రకారం

29 అక్టోబర్ 2024 (మంగళవారం) : ధన్తేరస్
31 అక్టోబర్ 2024 (గురువారం): చోటి దీపావళి
1 నవంబర్ 2024 (శుక్రవారం): బడి దీపావళి
2 నవంబర్ 2024 (శనివారం): గోవర్ధన్ పూజ
3 నవంబర్ 2024 (ఆదివారం): భాయ్ దూజ్

ఏ పండుగ అయినా ప్రదోష కాలంలో ఆచరించాలి. అదేవిధంగా దీపోత్సవం అమావాస్య తిథి నాడు జరుపుకుంటారు. కాబట్టి అమావాస్య రోజు నిర్వహించే ఉత్సవాలకు ఉదయ తిథికి ఎటువంటి ప్రాముఖ్యత లేదు.  ప్రజలు ఎటువంటి గందరగోళం లేకుండా అక్టోబర్ 31 న దీపావళి పూజను నిర్వహించాలి. ప్రభుత్వం కూడా అక్టోబర్ 31న దీపావళి సెలవు ప్రకటించింది. . గతంలో కూడా ఇలాంటి పరిస్థితులే వచ్చాయి.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies