Type Here to Get Search Results !

Sports Ad

తెలంగాణలో 5 రోజులు వర్షాలు Rains In Telangana For 5 Days

తెలంగాణలో 5 రోజులు వర్షాలు

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దశగా కదులుతూ మరింత బలంగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో తెలంగాణలో 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చించింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కి.మీ. ఎత్తు వరకు ఓ చక్రవాతపు ఆవర్తనం కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయి.

హైదరాబాద్‌లో భారీ వర్షం....
హైదరాబాద్‌లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం  ( అక్టోబర్​ 15) సాయంత్రం కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, ఆల్విన్‌ కాలనీ, ప్రగతినగర్‌, సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు, వికారాబాద్‌ జిల్లా తాండూరు, బహదూర్‌పల్లి, సూరారం, గుండ్ల పోచంపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.
 హైదరాబాద్ నగరంతో పాటుగా పలు జిల్లాల్లో వర్షాలు పడతాయి. . నేడు ( అక్టోబర్​ 15)  కూడా నగరంలో వర్షాలకు ఛాన్స్ ఉండగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు.

 తెలంగాణలో  పలు ప్రాంతాల్లో ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ క్రమంలో తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మెదక్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌, ములుగు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముంది. మంగళ, బుధవారాల్లో ( 15, 16 తేదీలు)  ఉమ్మడి నిజామాబాద్‌, ఖమ్మం, నల్గొండ, వరంగల్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌తోపాటు నిర్మల్‌ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చు.ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

Low pressure has formed in Southeast Bay of Bengal. The Hyderabad Meteorological Center said that the low pressure will move in the west-northwest phase and become stronger. With this, there is a possibility of rains in Telangana for 5 days. 5.8 km above mean sea level in the west-central Bay of Bengal on the southern Andhra Pradesh coast. A cyclonic cycle is concentrated up to the height. Due to this effect, winds are blowing from east and south-east direction in Telangana state.

 The meteorological department has warned that there is a possibility of heavy rain in Hyderabad as well. According to the Meteorological Department, on Monday (October 15) evening, there will be rain in Kukatpally, Hydernagar, Alvin Colony, Pragatinagar, Patancheru in Sangareddy district, Tandur, Bahadurpally in Vikarabad district, Suraram, Gundla Pochampally and other places.

 Along with Hyderabad city, there will be rains in many districts. . Even today (October 15) there is a chance of rain in the city.. GHMC officials advised people to be alert. They said that there will be rains with gusty winds, thunder and lightning in many parts of Telangana. In this order, yellow alert has been issued to many districts of Telangana. 

 There is a possibility of light to moderate rain in the combined districts of Adilabad, Karimnagar, Khammam, Medak, Nizamabad, Mahbubnagar, Nalgonda, Ranga Reddy, Hyderabad and Mulugu. On Tuesday and Wednesday (15th and 16th), Nizamabad, Khammam, Nalgonda, Warangal, Hyderabad, Ranga Reddy, Medak, Mahabubnagar and Nirmal districts may experience light to moderate rains.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies