రూలింగ్కు మరో 50 రోజులు పుష్ప- 2 కొత్త పోస్టర్ రిలీజ్
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : అల్లు వారసుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన పుష్ప సీక్వెల్ "పుష్ప 2: ది రూల్" చిత్రం ఈ ఏడాది చివరన కానున్న విషయం తెలిసిందే. 2024 డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ థియోటర్లలోకి రానుంది. అందుకు మరో 50 రోజుల సమయముండగా ఆ గడువును తెలుపుతూ మేకర్స్ తాజాగా గురువారం (అక్టోబర్ 17న) కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో పుష్ప రాజ్ ఓ మాదిరిగా కుర్చీలో కూర్చొని తనదైన శైలిలో కాలుమీద కాలు వేసుకుని ఇంటెన్స్గా కనిపిస్తున్నాడు.
ప్రేక్షకుల నిరీక్షణ తగ్గుతుంది. పుష్ప రాజ్ మరియు అతని బ్లాక్ బస్టర్ పాలనను చూడటానికి ఇంకా 50 రోజుల సమయం ఉంది పుష్ప 2: ది రూల్ తో ఇండియాన్ సినిమాకి కొత్త యుగం మొదలవుతోంది. 6 డిసెంబర్ 2024న థియేటర్లను రూల్ చేయబోతుంది" అంటూ మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రోడక్షన్ పనులు ముగించుకునే దశలో ఉంది. దాంతో దేశవ్యాప్తంగా వరుస ప్రమోషన్స్ చేయడానికి రెడీ అవుతోంది చిత్ర బృందం.
ఇటీవలే" పుష్ప2 కథకు మరిన్ని హంగులు జోడించి డైరెక్టర్ సుకుమార్ తీర్చిదిద్దుతున్నారు. మరోవైపు, తాను ఫస్టాఫ్ చూశానని, అదిరిపోయిందని.. ప్రతి సీన్ ఇంటర్వెల్‌లా ఉంటుందంటూ ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే విడుదలైన ‘సూసేకి’, ‘పుష్ప పుష్పరాజ్’ పాటలు యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకున్నాయి.
పుష్ప పార్ట్ -1 సక్సెస్ కావడం ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు రావడంతో పార్ట్ 2పై అంచనాలు తారస్థాయికి చేరాయి. అందునా పార్ట్-1కు వచ్చిన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని సుకుమార్ చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. అందువల్లే, ఈ చిత్రం రిలీజ్ కు ఆలస్యమవుతూ వస్తోంది. తొలుత ఈ మూవీ ఆగష్టు 15న థియోటర్లలోకి రానుందని ప్రకటించినప్పటికీ అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తికాకపోవడంతో వాయిదా వేశారు.
అప్పటినుంచి మేకర్స్ ఎప్పటికప్పుడు మూవీకి సంబంధించిన అప్‌డేట్లను ఒక్కొక్కటిగా అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
It is known that Pushpa's sequel "Puspa 2: The Rule" starring Allu's successor and icon star Allu Arjun is slated to release later this year. The movie will hit the theaters worldwide on December 6, 2024. While there is another 50 days for that, the makers have released a new poster on Thursday (October 17) stating the deadline. In this poster, Pushpa Raj is sitting on a chair and looking intense in his own style.
The makers said, "Audience's anticipation is coming down. There are still 50 days to watch Pushpa Raj and his blockbuster rule.. Pushpa 2: The Rule is ushering in a new era of Indian cinema. It is going to rule the theaters on 6th December 2024." Currently, the post production work of this movie is being completed. With that, the film team is getting ready to do a series of promotions across the country.
Recently" Director Sukumar is adding more emotions to the story of Pushpa 2. On the other hand, he has seen the first part and was shocked. Music director Devisree Prasad made interesting comments at a recent event saying that every scene is like an interval. The already released songs 'Suseki' and 'Pushpa Pushparaj' are on YouTube. The views are at a record level.
The success of Pushpa Part-1 As Allu Arjun won the National Award for Best Actor, the expectations for Part 2 have reached the highest level. Keeping in mind the craze for Part-1, Sukumar is filming very carefully. Therefore, the release of this film is getting delayed.
Although the movie was initially announced to hit the theaters on August 15, it was postponed as the shooting was not completed on schedule. Since then, the makers have been sharing updates about the movie one by one with the fans. Mythri Movie Makers and Sukumar Writings are jointly producing this movie with a huge budget of Rs.500 crores.