హైదరాబాద్ రోడ్లపై చెత్త వేస్తే రూ.500 ఫైన్
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : రోడ్లపై చెత్త, నిర్మాణ వ్యర్థాలు వేస్తున్న వారికి జీహెచ్ఎంసీ ఫైన్లు వేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు సర్క్యూలర్ జారీ చేసింది. రోడ్లపై చెత్త వేస్తే సర్కిల్ స్థాయిలో మెడికల్ ఆఫీసర్లు, కన్ స్ట్రక్షన్ అండ్ డిమాలిష్(సీ అండ్ డీ) వ్యర్థాలు వేస్తే టౌన్ ప్లానింగ్ అధికారులు రూ.500 లేదా అంతకు మించి ఫైన్లు వేయనున్నారు.
ఇందుకోసం సర్కిల్ స్థాయిలో ప్రత్యేకంగా టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. రోడ్లపై చెత్త వేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా జనం వినడం లేదు. అలాగే ఇండ్లను కూల్చి ఎక్కడ పడితే అక్కడ నిర్మాణ వ్యర్థాలను తీసుకొచ్చి డంప్ చేస్తున్నారు. ఫైన్లు వేస్తేనైనా మార్పు కనిపిస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.