ఇంజినీరింగ్ చేసిన వారికి గుడ్‌న్యూస్ కోల్ ఇండియాలో 640 ఉద్యోగాలు
జాతీయ National News భారత్ ప్రతినిధి : భారత ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్(CIL) వివిధ విభాగాల్లో 640 ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే వారికి ఇదొక సువర్ణావకాశం. BE/ BTech పూర్తి చేసిన వారు, చివరి సంవత్సరం చదువుతున్న వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 29 నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 640 విభాగాల వారీగా పోస్టులు
మైనింగ్ ఇంజినీరింగ్: 263
సివిల్ ఇంజనీరింగ్: 91
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 102
మెకానికల్ ఇంజినీరింగ్: 104
సిస్టమ్ ఇంజనీరింగ్: 41
ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్: 39
విద్యార్హతలు: BE/ BTech పూర్తి చేసిన వారు లేదా చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. అలాగే, చెల్లుబాటు అయ్యే గేట్ 2025 స్కోర్ కలిగి ఉండాలి. (GENERAL, OBC, EWS అభ్యర్థులు 60 శాతం మార్కులు SC, ST, PwBD అభ్యర్థులు 55 శాతం మార్కులు సాధించి ఉండాలి)
వయోపరిమితి: 30/09/2024 నాటికి అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: గేట్ పరీక్ష స్కోర్, ఇంటర్వ్యూ లేదా వ్రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూసీ అభ్యర్థులు రూ.1,180 దరఖాస్తు రుసుముగా చెల్లించాలి. ఎస్‌సీ / ఎస్‌టీ /పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుండి నుండి మినహాయింపు ఉంది.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 29/ 10/ 2024
దరఖాస్తులకు చివరి తేదీ: 28/ 11/ 2024