పెళ్లిళ్ల సీజన్ 79 వేలకు చేరిన బంగారం
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఈ సారి అక్టోబర్ లోనే పెళ్లి ముహూర్తాలు మొదలు కావడంతో పసిడి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ 3 నెలల్లో పెళ్లిళ్ల సందడి అంబరాన్నంటనుంది. నవంబర్ డిసెంబర్ నెలల్లో దేశవ్యాప్తంగా 48లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ( CAIT ) జరిపిన ఒక అధ్యయనంలో తేలింది. ఈ క్రమంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం.
హైదరాబాద్ లో ఎంతంటే..
అక్టోబర్ 18న మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం(10 గ్రాములు)పై రూ. 870 పెరగగా 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.800 పెరిగింది. పెరిగిన రేట్లతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 78, 980గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,400 గా ఉంది. హైదరాబాద్,విజయవాడ,విశాఖపట్నంలో అక్టోబర్ 18 ఉదయం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గాను రూ. 72400 ఉండగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు గాను 78890 నమోదయ్యింది.
2 వేలు పెరిగిన వెండి..
దసరా సమయంలో తగ్గినట్టే తగ్గి మళ్లీ ఇప్పుడు ఒక్కసారిగా పెరిగాయి. కిలో వెండి రూ. 2000 మేరకు పెరిగింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల మార్కెట్లలో శుక్రవారం కిలో వెండి ధర రూ. 1,05,000గా ఉంది. ముంబై, పూణే, ఢిల్లీ, కోల్‌కతా వంటి ప్రధాన మార్కెట్లలో కిలో రూ. 99,000గా నమోదయ్యింది.
Gold prices have risen again. This time, as the wedding season starts in October itself, the prices of pasidi are increasing day by day. Not only in the Telugu states but also in the whole country, there will be a buzz of weddings in these 3 months. A study conducted by the Confederation of All India Traders (CAIT) has revealed that 48 lakh weddings will take place across the country in the months of November and December. In this order, let's find out how the prices of gold are.
On October 18, 24 carat Tulam gold (10 grams) in the market at Rs. 870 has increased..800 has increased on the price of 22 carat gold. 10 grams of 24 carat gold with increased rates Rs. 78,980 while the price of 10 grams of 22 carat gold is Rs.72,400.
On the morning of October 18 in Hyderabad, Vijayawada and Visakhapatnam, the price of 22 carat gold per 10 grams was Rs. 72400 while 78890 was recorded for 10 grams of 24 carat gold.
It decreased during Dussehra and now it has increased once again. Kilo Silver Rs. 2000 has increased. In this order, the silver price per kg in the markets of Telugu states on Friday was Rs. 1,05,000. In major markets like Mumbai, Pune, Delhi, Kolkata Rs. 99,000 was recorded.