గుడ్న్యూస్ ఇండియన్లకోసం 90వేల వీసాలు పెంచిన జర్మనీ
జాతీయ National News భారత్ ప్రతినిధి : ఇండియన్ల కోసం జర్మనీ వీసా కోటా పెంచింది..ఏడాదికి 90వేల వీసాలు మంజూరు చేయనుంది. స్కిల్స్ ఉన్న భారతీయ ఉద్యోగులకు ప్రతియేటా మంజూరు చేసే వీసా ల సంఖ్యను 20వేల నుంచి 90వేలకు పెంచాలని జర్మనీ నిర్ణయించిందని ప్రధాని మోదీ శుక్రవారం ( అక్టోబర్ 25) నప్రకటించారు. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్కు ఇండియాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఒలాఫ్ స్కోల్జ్ తో సమావేశమయ్యారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా ఒలాఫ్ స్కోల్జ్ మాట్లాడుతూ రెండు దేశాల మధ్య వాణిజ్యం, ద్వైపాక్షిక చర్యలు జరిపారు.
ఈ ఏడాది ప్రతిభ ఉన్న 90వేల మంది ఇండియన్లను తమ మార్కెట్లోకి స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. డిజిటలైజేషన్, ప్రాసెసింగ్, కస్టమర్ రిలేటివ్ కార్యక్రమాల్లో వీసాలను పెంచుతున్నట్లు వెల్లడించారు. జర్మనీ, ఇండియా, యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్చావాణిజ్య ఒప్పందం కొనసాగిస్తోంది.ఎనిమిదేళ్ల తర్వాత జూన్ 2022 నుంచి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు తిరిగి ప్రారంభమయ్యాయి. రక్షణ , టెక్నాలజీ రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం అవసరమని జర్మనీ ఛాన్సలర్ అన్నారు.
పెరిగిన కోటా జర్మనీలో అవకాశాలను కోరుకునే ఇండియన్స్ కి లైన్ క్లియర్ చేస్తోంది. ఇమ్మిగ్రేషన్ విధానాలను సమర్థవంతంగా చేస్తుంది. కొత్తవారికి ఇదే మంచి తరుణం. భారతీయుల కోసం వీసా కోటాలో ఈ విస్తరణ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయనుంది. విద్య, పరిశోధన, వృత్తిపరమైన శిక్షణలో సహకారా న్ని అందించనుంది.