ముంబైకి కలిసొచ్చిన ఆక్షన్ రూల్ స్టార్ ప్లేయర్లందరూ జట్టుతోనే
జాతీయ National News భారత్ ప్రతినిధి : ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. స్టార్ ఆటగాళ్లతో ఆ జట్టు ఎప్పుడూ పటిష్టంగా కనిపిస్తుంది. రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, ఇషాన్ కిషాన్ లాంటి అగ్ర శ్రేణి ఆటగాళ్లు కొన్నేళ్లుగా ముంబై జట్టులో కొనసాగుతున్నారు. ఈ సారి 2025 ఐపీఎల్ కోసం మెగా ఆక్షన్ జరగనుండడంతో ఎవర్ని రిటైన్ చేసుకోవాలో అనే విషయంపై ముంబై ఇండియన్స్ బిజీగా ఉంది. అయితే మెగాఆక్షన్ అయినా ముంబై ఇండియన్స్ తోనే ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు ఉండనున్నారు.
2025 ఐపీఎల్ ఆక్షన్ రూల్ ముంబై ఇండియన్స్ కు బాగా కలిసొచ్చింది. అన్ని జట్లతో పోలిస్తే రిటైన్ రూల్ ముంబై శిబిరంలో ఆనందం కలిగిస్తుంది. మొదటి రిటైన్ ప్లేయర్ గా కెప్టెన్ హార్దిక్ పాండ్య రెండో రిటైన్ ఆటగాడిగా సూర్య కుమార్ యాదవ్ మూడో రిటైన్ ప్లేయర్ గా ఇషాన్ కిషన్ తీసుకోనుంది. నాలుగో రిటైన్ ప్లేయర్ గా రోహిత్ శర్మను ఐదో రిటైన్ ఆటగాడిగా బుమ్రాను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రిటైన్ రూల్స్ ప్రకారం తొలి రిటైన్ ప్లేయర్ కు రూ. 18 కోట్లు చెల్లించాల్సి ఉంది. రెండు, మూడు రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు ఇవ్వాల్సి ఉంది. నాలుగు ఐదు రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ. 14 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. దీని ప్రకారం స్టార్ ఆటగాళ్లను ముంబై వదులుకునే అవకాశాలు కనిపించడం లేదు.
మొత్తం 120 కోట్ల పర్స్ లో రూ. 75 కోట్లు ఈ స్టార్ ఆటగాళ్లకు కేటాయించడం దాదాపుగా ఖాయం. మిగిలిన రూ. 45 కోట్లతో ఎవరిని టార్గెట్ చేస్తుందో ఆసక్తికరంగా మారింది. RTM కార్డు ద్వారా టిమ్ డేవిడ్, నెహ్యాల్ వధేరా, ఆకాష్ మద్వల్ ను తీసుకునే అవకాశం ఉంది.
Mumbai Indians have an undeniable following in IPL. The team always looks strong with star players. Top class players like Rohit Sharma, Surya Kumar Yadav, Jasprit Bumrah, Hardik Pandya and Ishan Kishan have been in the Mumbai team for years. This time, Mumbai Indians are busy deciding who to retain as the mega action is going to happen for IPL 2025. But the star players of that team will be with Mumbai Indians even if it is a mega action.
The 2025 IPL action rule has suited Mumbai Indians well. Compared to all the teams, the retain rule makes the Mumbai camp happy. Captain Hardik Pandya will be the first retained player. Surya Kumar Yadav will be the second retained player and Ishan Kishan will be the third retained player. There are chances of taking Rohit Sharma as the fourth retained player and Bumrah as the fifth retained player.
According to the retain rules, the first retained player will get Rs. 18 crores to be paid. Players who retain two and three respectively will get Rs. 14 crores, Rs. 11 crores to be given. 18 crores and Rs. 14 crores to be paid. According to this, there is no chance of Mumbai giving up the star players.
120 crores in total purse Rs. 75 crores is almost certain to be allotted to these star players. Remaining Rs. It has become interesting who will be targeted with 45 crores. Tim David, Nehyal Wadhera, Akash Madwal are likely to be picked up through the RTM card.