భూదాన్ ల్యాండ్స్ అన్యాక్రాంతం సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ హస్తం
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : జిల్లా బాస్ అయిన కలెక్టరే అవినీతికి పాల్పడితే ఏం చేయాలి గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పని చేసిన ఐఏఎస్ అమోయ్ కుమార్ 50 ఎకరాల భూదాన్ భూములను అన్యాక్రాంతం చేశాడు. విజిలెన్స్ విచారణలో అమోయ్ కుమార్ భాగోతం బయటపడింది. ఇదే వ్యవహారంలో అప్పటి MRO జ్యోతిపై కూడా కేసు నమోదైంది. తీగపట్టుకొని లాగితే డొక్కంతా కదిలినట్లు విచారిస్తే కలెక్టర్ కథలు బయటకు వచ్చాయి. విజిలెన్స్ అధికారులు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నాగరంలోని సర్వే నెంబర్ 181, 182 లోని 102.2 ఎకరాలపై కొంత కాలంగా వివాదం నడుస్తోంది. అందులో 50 ఎకరాల భూమి భూదాన్ బోర్డ్ కి చెందినదని బోర్డ్ వాదిస్తోంది. ఈ భూమి జబ్బార్దస్త్ ఖాన్ అనే వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది. తర్వాత ఆయన కొడుకు హజీఖాన్ 50 ఎకరాల ల్యాండ్ ను భూదాన్ బోర్డ్ కి దానం చేశాడు. 2021లో హజీఖాన్ వారుసురాలిని అంటూ 40 ఎకరాలు తనదేనని ఖాదురున్నీసా దరఖాస్తు చేసుకుంది. క్షేత్ర స్థాయిలో RDO, తహశీల్దార్, ఆర్ఐలు, సీనియర్ అసిస్టెంట్ ఖాదురున్నీసాకు అనుకూలంగా ఉండి.. ఆఘమేఘాల మీద ఆమె పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ చేశారు. ఆ భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీకి అమ్మారు. దీంతో ఎన్నికల సమయంలో భారీగా ఫిర్యాదులు వచ్చాయి.
ఈ భూమిపై క్రయవిక్రయాలు చేయకుండా ధరణిలో నిషేధిత జాబితాలో పెట్టారు అధికారులు. ఈ వ్యవహారం కోర్ట్ కి చేరడంతో కోర్ట్ ఆదేశాలతో అప్పటి MRO జ్యోతి, జాయింట్ సబ్ రిజిస్టార్, EIPL కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఓనర్ కొండపల్లి శ్రీధర్ పై కేసు నమోదు చేశారు. రెండు కేసులో భారీ స్థాయిలో ఆర్థిక లావాదేవీలు జరగడంతో ఈడీ రంగంలోకి దిగింది. విజిలెన్స్ అధికారులు కలెక్టర్ తోపాటు అందర్ని విచారించగా అసలు విషయాలు బటయటకు వచ్చాయి. ఇంకా IAS అధికారి అమోయ్ కుమార్ విచారణ కొనసాగుతున్నది.