డైటింగ్ చేస్తున్నారా అయితే అవి దెబ్బతినడం ఖాయం
Health News భారత్ ప్రతినిధి : బరువు తగ్గాలంటే డైటింగ్ ఒక్కటే దారి. అందుకే ఈ మధ్య అందరూ రకరకాల డైట్స్ ను పాటిస్తున్నారు. అయితే డైటింగ్ తో ఓ కొత్త చిక్కు ఉందని ఇటీవల ఓ పరిశోధనలో తేలింది. పెద్ద వయసులో డైటింగ్ చేస్తే బరువుతో పాటు ఎముకల్లో సాంద్రత కూడా తగ్గుతోందని ఆ స్టడీ చేస్తోంది. వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ డెన్నిస్ విల్లేరియల్ బృందం చేసిన అధ్యయనంలో డైటింగ్ చేసేవారిలో శరీరం బరువుతో పాటు ఎముకల సాంద్రత కూడా తగ్గిపోతుందని, డైటింగ్ వల్ల వృద్ధుల్లో ఎముకలు విరిగే అవకాశం కూడా ఉంటుందని డాక్టర్లు చెప్పారు.
50 ఏళ్లు పైబడిన వాళ్లపై చేసిన ఈ అధ్యయనంలో బరువు తగ్గడానికి కొందరు కేవలం డైటింగ్ పై ఆధారపడితే, మరికొందరు డైటింగ్ తో పాటు వ్యాయామం కూడా చేశారు. వ్యాయామం చేయకుండా తిండి మాత్రమే తగ్గించిన వాళ్లలో బరువుతో పాటు ఎముకల సాంద్రత కూడా తగ్గుతున్నట్టు డాక్టర్లు గమనించారు. అందుకే డైటింగ్ చేసే వాళ్లు వ్యాయామంపై కూడా దృష్టి పెట్టాలి. వ్యాయామం వల్ల కండరాలతోపాటు ఎముకల పటుత్వం కూడా పెరుగుతుంది. అందుకే డైటింగ్ కన్నా ముందు వ్యాయామంతో బరువు తగ్గించుకొనే ప్రయత్నం చేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
Dieting is the only way to lose weight. That's why everyone is following various diets these days. But a recent research has shown that there is a new complication with dieting. The study shows that dieting at an older age decreases bone density along with weight. In a study conducted by Dr. Dennis Villarreal's team from Washington University, the body weight and bone density also decrease in dieters, and the doctors said that dieting can also increase the risk of bone fractures in the elderly.
In this study of people over 50 years of age, some relied on dieting alone to lose weight, while others did dieting along with exercise. Doctors observed that in those who only reduced food without exercise, the weight and bone density also decreased. That's why dieters should also focus on exercise. Exercising increases muscle strength as well as bone strength. That is why doctors suggest trying to lose weight with exercise before dieting.