టాటూతో జర జాగ్రత్త టాటూతో వచ్చే అనారోగ్య సమస్యలు ఇవే
Health News భారత్ ప్రతినిధి : స్టయిల్ గా కనిపించాలని కొందరు, సరదాకు, ఇంకొందరు సెంటిమెంట్ తో మరికొందరు టాటూ వేయించుకుంటారు. ఇష్టమైన హీరో, సెలబ్రిటీ కూడా టాటూతో కనిపిస్తుండటంతో.. టాటు వేయించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే, టాటూకు ఉపయోగించే సూది, రంగులు చర్మానికి హాని కలిగిస్తాయి. అంతేకాదు ఇన్ఫెక్షన్లకు, అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి అంటున్నారు డెర్మటాలజీ ఎక్స్పర్ట్. టాటూ వేసుకోవడం తప్పు కాదు. కానీ వేయించుకోవడానికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఇప్పుడు ఆ జాగ్రత్తలు ఏవో తెలుసుకుందాం.
* టాటూలో వాడే సిరా, పలు రంగుల్లో ఉండటంతో చర్మం మీద దురద పెట్టడం చర్మం ఎరుపెక్కడం వంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. ఇలాంటి ఎలర్జీలు రాకుండా ఉండాలంటే నేచురల్ కలర్స్ తో టాటూ వేయించుకోవాలి.
* టాటూ వల్ల హెపటైటిస్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. టాటూ వేసేందుకు ఒకరికి వాడిన సూదినే మరొకరికి వాడటం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది.
* టాటూ వేసేటప్పుడు ఇంక్ చర్మంలోకి వెళుతుంది. ఒకవేళ బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిన సూదిని, రంగుని మరొకరికి యూజ్ చేయడం వల్ల బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. టాటూ వేసుకునే ముందు నీడిల్, డై క్లీన్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.
* టాటూ వేసుకున్న చోట నెమ్మదిగా చెమట పట్టడం తగ్గిపోతుంది. దీని వల్ల బాడీ టెంపరేచర్ లో మార్పులు వస్తాయి. ఇది జీవక్రియ (మెటబాలిజమ్) మీద ప్రభావం చూపిస్తుంది.
* టాటూ వేసిన చోట చర్మం ఉబ్బి, దద్దుర్లు వస్తాయి. పర్మినెంట్ టాటూ వేసుకుంటే ఎప్పుడైన అవసరమైన ఎంఆర్ ఐ స్కాన్ చేయించుకుంటే సరిగ్గా రాదు. ఈ సమస్య అందరిలో కనిపించకపోవచ్చు.
Some get tattooed to look stylish, for fun, others with sentiment and others. Favorite hero and celebrity are also seen with a tattoo.. they are showing interest in getting a tattoo. However, the needle and dyes used for tattooing can harm the skin. Moreover, they cause infections and health problems, says a dermatology expert. Tattooing is not wrong. But before frying some precautions should be taken. Now let's know what those precautions are.