ప్రయాణికులకు బిగ్ షాక్ రైలు రిజర్వేషన్ రూల్స్ మారాయి కొత్త నిబంధనలు ఇవే
జాతీయ National News భారత్ ప్రతినిధి : ట్రైన్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్ రూల్స్లో భారతీయ రైల్వే శాఖ కొన్ని కీలక మార్పులు చేసింది. ఇప్పటిదాకా ట్రైన్ షెడ్యూల్ డేట్కు 120 రోజుల ముందుగా టికెట్ బుక్ చేసుకునే సదుపాయం ఉండేది. ఇకపై 60 రోజుల ముందు నుంచి మాత్రమే ఐఆర్సీటీసీలో (IRCTC) ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది.
ఈ మేరకు అడ్వాన్స్ బుకింగ్ విధానంలో భారతీయ రైల్వే శాఖ మార్పులుచేర్పులు చేసింది. ఈ కొత్త రూల్ నవంబర్ 1, 2024 నుంచి అమల్లోకి రానుంది. అయితే ఇప్పటికే బుక్ చేసుకున్న టికెట్లకు ఈ నిబంధన వర్తించదన్న విషయం రైల్వే ప్రయాణికులు గమనించాలి. రైల్వే టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి ఐఆర్‌సీటీసీ ఒక్కటే మార్గం. చాలా సైట్లు రైల్వే టికెట్ల బుకింగ్ సేవలను అందిస్తున్నా, అవి చివరికి ఐఆర్‌సీటీసీ సర్వర్ ద్వారానే బుక్ అవుతాయి. టికెట్లు కేన్సిల్ చేసుకుంటే ఐఆర్‌సీటీసీ భారీగా కేన్సిలేషన్ ఛార్జీలు వసూలు చేస్తుంది. అయితే ఇవి రకరకాలుగా ఉంటాయి.
రైలు చార్టు తయారీకి ముందు కేన్సిల్ చేస్తే తక్కువ చార్జీ, కన్ఫార్మ్ టికెట్‌లను కేన్సిల్ చేసుకుంటే మరింత ఎక్కువ ఫైన్ పడుతుంది. ఉదాహరణకు ఏసీ ఫస్ట్ క్లాస్ టికెట్ కేన్సిల్ చేస్తే రూ. 240 ఛార్జ్ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ క్లాస్ లేదా ఏసీ ఫస్ట్ క్లాస్, ఏసీ టూ-టైర్, ఏసీ త్రీ-టైర్ వంటి టికెట్ల క్లాసులపై క్యాన్సిలేషన్ ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ప్రకటించింది.
Indian Railways has made some key changes in Train Ticket Advance Booking Rules. Until now there was a facility to book tickets 120 days before the train schedule date. Henceforth, it is possible to book a train ticket in IRCTC only from 60 days before.
To this extent, the Indian Railway Department has made changes in the advance booking system. This new rule will come into effect from November 1, 2024. However, railway passengers should note that this provision does not apply to already booked tickets.
IRCTC is the only way to book railway tickets online. Although many sites offer railway ticket booking services, they are ultimately booked through IRCTC servers. If tickets are cancelled, IRCTC charges heavy cancellation charges. But these are different.
If you cancel before the train chart is prepared, the charge will be less, if you cancel conform tickets, you will get more fine. For example if AC first class ticket is canceled Rs. 240 will be charged. Indian Railway Catering and Tourism Corporation (IRCTC) has announced that cancellation charges will be different for ticket classes like Executive Class or AC First Class, AC Two-Tier, AC Three-Tier.