Type Here to Get Search Results !

Sports Ad

కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్ Big Twist In Episode Nagarjuna's Defamation Suit Against Konda Surekha

కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్ 

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున వేసిన పరువు నష్టం దావా పిటిషన్పై నాంపల్లి స్పెషల్ కోర్టులో బుధవారం(అక్టోబర్ 23, 2024) విచారణ జరిగింది. కొండా సురేఖ తరపున అడ్వకేట్ గుర్మిత్ సింగ్ వకాలత్ ఫైల్ చేశారు. తదుపరి విచారణను అక్టోబర్ 30కి నాంపల్లి స్పెషల్ కోర్ట్ వాయిదా వేసింది. మంత్రి కొండా సురేఖకు నాంపల్లి స్పెషల్ కోర్టు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. హీరో నాగార్జున వేసిన క్రిమినల్‌‌, పరువునష్టం దావా కేసులో వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

 అక్కినేని నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆర్ కారణమంటూ కొండా సురేఖ చేసిన కామెంట్స్‌‌పై నాగార్జున కోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌‌పై కోర్టు విచారణ జరిపింది. ఓపెన్‌‌ కోర్టులో నాగార్జున సహా సాక్షులుగా ఉన్న యార్లగడ్డ సుప్రియ, మెట్ల వెంకటేశ్వర్లు వాంగ్మూలాన్ని న్యాయమూర్తి ఇప్పటికే రికార్డు చేశారు. నాగార్జున అందించిన ఆధారాలను పరిగణలోకి తీసుకున్నారు. నాగార్జునపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇవ్వాలని కొండాకు జారీ చేసిన నోటీసుల్లో కోర్టు పేర్కొంది.

A hearing was held on Wednesday (October 23, 2024) in the Nampally Special Court on the defamation suit petition filed by film actor Nagarjuna against Telangana Minister Konda Surekha. Advocate Gurmeet Singh Vakalat filed on behalf of Konda Surekha. The Nampally Special Court adjourned the next hearing to October 30. It is known that the Nampally Special Court has issued notices to Minister Konda Surekha. It has issued orders to explain in the case of criminal defamation suit filed by Hero Nagarjuna.

 Akkineni Naga Chaitanya and Samantha Nagarjuna approached the court over Konda Surekha's comments claiming that KTR was the reason for their breakup. The court heard the petition filed by him. The judge has already recorded the testimony of Yarlagadda Supriya and Metla Venkateswarlu, who were witnesses along with Nagarjuna in the open court. The evidence provided by Nagarjuna was considered. In the notices issued to Konda, the court asked him to explain his comments on Nagarjuna.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies