శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. బుధవారం( అక్టోబర్ 30 ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టులో మూడు విమానాలకు బాంబు బెదిరింపుకాల్స్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇందులో చెన్నై వెళ్సాల్సిన రెండు ఇండిగో విమానాలకు, ఒకటి చెన్నైనుంచి వచ్చిన విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ చేశారు దుండగులు.
విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ లో అప్రమత్తమైన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఎయిర్‌లైన్స్, హోటళ్లు, బ్యాంకులు, ఇతర ప్రాంతాలకు బాంబు బెదిరింపు కాల్స్ చేసిన నిందితుడిని మంగళవారం అరెస్టు చేశారు పోలీసులు. నిందితుడు 35 ఏళ్ల జగదీష్ అనే రచయితగా గుర్తించారు. వివిధ సంస్థలకు పంపిన వరుస ఇమెయిల్‌లు జగదీష్ నుంచి వచ్చినట్టు నిర్దారించారు. ఈ వ్యక్తి తీవ్రవాదంపై ఓ పుస్తకాన్ని రాశారు. ఇప్పటికే ఓ కేసులో 2021లో అరెస్టు కూడా అయ్యాడు.