రెండు ఇండిగో విమానాలకు బాంబ్ బెదిరింపు
జాతీయ National News భారత్ ప్రతినిధి : రెండు ఇండిగో విమానాలకు బాంబ్ బెదిరింపు వచ్చింది. అక్టోబర్ 14న ఉదయం రెండు విమానాలు ముంబై నుంచి టేకాఫ్ కావాల్సి ఉంది. వాటిలో ఒకటి ముంబై నుంచి (విమానం 6E 1275) మస్కట్‌కు.. మరొకటి (విమానం 6E 56) ముంబై నుంచి జెడ్డాకు వెళ్లాల్సింది. వెంటనే అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ అధికారులు విమానాన్ని తనిఖీ చేశారు. ప్రయాణికులందరూ సేఫ్ గా ఉన్నారు.
మరో వైపు ముంబై నుంచి న్యూయార్క్‌కు బయల్దేరిన విమానానికి బాంబు బెదిరింపు రావడంతో వెంటనే ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్ పోర్ట్ కు దారి మళ్లించారు అధికారులు. ప్రస్తుతం ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని వెల్లడించారు. ప్రయాణికులు, సిబ్బంది భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు అధికారులు.
Two IndiGo flights received a bomb threat. Two flights were scheduled to take off from Mumbai on the morning of October 14. One of them was from Mumbai (Flight 6E 1275) to Muscat and the other (Flight 6E 56) was to fly from Mumbai to Jeddah. Airport officials were immediately alerted and checked the plane. All passengers are safe.
On the other hand, the flight departing from Mumbai to New York received a bomb threat and the authorities immediately diverted it to the Indira Gandhi Airport in Delhi. At present, all the passengers are safe and there is no accident. He said that all measures are being taken for the safety of passengers and staff. Officials said they are investigating the incident