దారుణం ట్రీట్మెంట్ కోసం వచ్చి డాక్టర్ను కాల్చి చంపారు
జాతీయ National News భారత్ ప్రతినిధి : చికిత్స కోసం హాస్పిటల్ కు వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని యువకులు డాక్టర్ ను కాల్చి చంపిన దారుణం గురువారం ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీలోని జైత్పూర్ ప్రాంతంలోని నిమా ఆస్పత్రిలో గురువారం తెల్లవారుజామున 2గంటలకు ఈ హత్య జరింగింది. దాదాపు 17 ఏళ్ల వయసున్న ఇద్దరు యువకులు ట్రీట్మెంట్ కోసం గురువారం అర్థరాత్రి నిమా క్లినిక్ వచ్చారు.
వారిలో ఒకరు కాలి గాయంతో ఉన్నారు. గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేయాలని హాస్పిటల్ సిబ్బందిని కోరారు. కాలికి కట్టు కట్టించుకున్నాక ఓ యువకుడు డాక్టర్ క్యాబిన్ లోకి వెళ్లి డాక్టర్ తలకు గన్ గురి పెట్టి కాల్చి చంపాడు. యునాని మెడిసిన్ ప్రాక్టీషనర్ డాక్టర్ జావేద్ అక్తర్ అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు 55 ఏళ్ల డాక్టర్ జావేద్ అక్తర్ గా గుర్తించారు.
పోలీసులకు ఈ విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. హాస్పిటల్ లో ని సీసీఫుటేజీని పరిశీలించారు. నిందితులు అక్టోబర్ 1న కూడా హాస్పిటల్ కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఢిల్లీ పోలీస్ ఫోరెన్సిక్స్ యూనిట్ హత్య జరిగిన ప్రదేశంలో ఆధారాలను సేకరించేందుకు సంఘటనా స్థలానికి చేరుకుంది.
An atrocity took place in Delhi on Thursday when a doctor was shot dead by two unidentified youths who came to the hospital for treatment. The murder took place at Nima Hospital in Delhi's Jaitpur area at 2 am on Thursday. The two youths, aged around 17, were on Thursday for treatment
One of them has a leg injury. He asked the hospital staff to give first aid to the injury. After the leg was bandaged, a young man went into the doctor's cabin and shot him dead by pointing a gun at the doctor's head. Unani medicine practitioner Dr. Javed Akhtar died on the spot. Deceased 55
As soon as the police came to know about this, they reached the spot. A case has been registered and investigation is underway. The CCTV footage of the hospital was examined. The police found that the accused had come to the hospital on October 1 as well. Delhi Police Forensics Unit at the scene of the murder.