Type Here to Get Search Results !

Sports Ad

సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్కు ఈడీ నోటీసులు ED Notices To Senior IAS Officer Amoy Kumar

సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్కు ఈడీ నోటీసులు

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. గతంలో భూ కేటాయింపులో అక్రమాలు జరిగాయని IAS అమోయ్ కుమార్కు ED నోటీసులు ఇచ్చింది. అక్టోబర్ 22 లేదా 23న విచారణకు హాజరు కావాలని ED నోటీసుల్లో పేర్కొంది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఆయన పనిచేశారు.
అబ్దుల్లాపూర్మెట్ మండలం పిగ్లిపూర్ రెవిన్యూ పరిధిలోని 17 సర్వే నంబర్లో ప్రభుత్వ రికార్డుల ప్రకారం 386 ఎకరాల భూమి ఉంది. ఇందులో 75 ఎకరాలు భూదాన్ యజ్ఞ బోర్డ్ భూమి కాగా, మరో 61 ఎకరాల ప్రభుత్వ భూమి.

 ఇందులో 53 ఎకరాల సీలింగ్ భూమి,197 ఎకరాల పట్టా భూమి ఉంది. ఇందులోని సీలింగ్ భూమిలో 16 మంది రైతులకు 45 ఎకరాలు ఉంది. ఈ భూమిని ఆ రైతులు వారి తాతలు, తండ్రుల కాలం నుంచి సాగుచేసుకుంటున్నారు.
ఇదే 17 సర్వే నంబర్లోని 26 ఎకరాల ప్రైవేట్​భూమిలో మెరుగు గోపాల్ యాదవ్ వెంచర్ వేసి, సీలింగ్ భూమిని కూడా కలుపుకున్నాడు. రైతులు పోలీస్ స్టేషన్, రెవెన్యూ అధికారుల చుట్టూ ఎంత తిరిగినా అధికారులు పట్టించుకోలేదు. ధరణిలో చూస్తే సీలింగ్​పట్టా అని చూపిస్తున్నది.

 బీఆర్ఎస్​లీడర్లను, అప్పటి తహసీల్దార్, ఆర్డీవోతోపాటు కలెక్టర్ అమోయ్​ కుమార్ను కలిసి ఎన్నో ఫిర్యాదులు ఇచ్చినా ఏం జరిగిందని కూడా అటు తొంగిచూడలేదు. బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమైన నేతలతో రియల్టర్కు మంచి పరిచయాలు ఉండడంతో తమ భూములు బెదిరించి గుంజుకున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అమోయ్ కుమార్ పాత్రపై నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు విచారణకు హాజరుకావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయనకు తాజాగా నోటీసులు ఇచ్చింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies