పత్తి కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు రానివ్వొద్దు కలెక్టర్ ప్రతీక్ జైన్
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా పత్తిని కొనాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులు, ట్రేడర్లతో మీటింగ్ నిర్వహించారు. జిల్లాలో సుమారు 2లక్షల మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని, 2024–25 సీజన్ పత్తి కొనుగోలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిన్నింగ్ మిల్లులు వద్ద ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు.
ఆన్లైన్లో లేని రైతుల లిస్టుకు ఏఈఓ సర్టిఫై చేస్తే ఆన్ లైన్ ధృవీకరణ ఇవ్వాల్సి ఉంటుందని, నకిలీ దృవీకరణ సర్టిఫికెట్లు జారీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం గ్రేడ్ వన్ కు మద్దతు ధర రూ. 7,521 , గ్రేడ్ -2 రకానికి రూ. 7,121 మద్దతు ధర ఉందని తెలిపారు.
ప్రభుత్వ సెలవు రోజుల్లో రైతులు ఎవరూ జిన్నింగ్ మిల్లులకు పత్తి తీసుకురావొద్దన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, మార్కెటింగ్ అధికారి సారంగపాణి, వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి, సీసీఏ బ్రాంచ్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.
Collector Prateek Jain has directed the officials to buy cotton without causing any trouble to the farmers. A meeting was held with officials and traders at the Collectorate on Tuesday. The district is expected to produce about 2 lakh metric tonnes of cotton and ordered to complete the arrangements at the ginning mills in view of the commencement of cotton procurement for the 2024-25 season.
He warned that if the AEO certifies the list of farmers who are not online, they will have to give online verification and strict action will be taken if fake verification certificates are issued. This year the Central Government has decided to support Grade One at Rs. 7,521, for Grade-2 type Rs. 7,121 support price.
No farmers should bring cotton to ginning mills on public holidays. Additional Collectors Lingya Naik, Sudhir, Marketing Officer Sarangapani, Agriculture Officer Mohan Reddy, Additional SP Ravinder Reddy, CCA Branch Manager and others participated in this meeting.