Type Here to Get Search Results !

Sports Ad

ద్వైపాక్షిక సిరీస్‌కు గుడ్ బై భారత్, పాక్ సిరీస్‌ లేనట్టేనా Good Bye India And Pakistan Series For Bilateral Series

 ద్వైపాక్షిక సిరీస్‌కు గుడ్ బై భారత్, పాక్ సిరీస్‌ లేనట్టేనా

జాతీయ National News భారత్ ప్రతినిధి : భారత్-పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ జరగక 12 ఏళ్ళు దాటిపోయింది. ఓ వైపు ఇరు జట్ల అభిమానులు దాయాధి జట్ల మధ్య పోరు చూడాలని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైనా సిరీస్ జరగకపోతుందా అని ఎదురు చూపులు చూసిన వారికి నిరాశ తప్పేలా కనిపించడం లేదు. తాజా సమాచార ప్రకారం ఈ భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఇకపై సిరీస్ ఆశించడం అత్యాశే అనిపిస్తుంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. 

 షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) శిఖరాగ్ర సదస్సు కోసం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇస్లామాబాద్‌ చేరుకున్నారు. జైశంకర్ బుధవారం SCO కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ యొక్క 23వ సమావేశానికి హాజరయ్యారు. 2012 తర్వాత ఒక భారత విదేశాంగ మంత్రి పాకిస్తాన్‌కు సందర్శించడం ఇదే మొదటిసారి. ఈ మీటింగ్ లో రెండు దేశాలకు సంబంధించి ద్వైపాక్షిక క్రికెట్ ప్రస్తావన రాలేదు. ఎలాంటి చర్చ జరగకపోవడంతో ద్వైపాక్షిక సిరీస్ మరో కొన్నేళ్లలో జరిగే ఛాన్స్ లేదు. 

 ఇండియా–పాక్‌‌ బైలేటరల్‌‌ సిరీస్‌‌లు మొదలయ్యే దాకా ఇరుదేశాల్లో పరిస్థితులు మెరుగుపడవు. ఇండియా, పాక్‌‌ క్రికెట్‌‌ ఫీల్డ్‌‌లో తలపడితే చూడాలని ప్రపంచమంతా కోరుకుంటుంది.చివరిసారిగా 2012 లో పాకిస్థాన్ భారత్ లో పర్యటించింది. 2008 లో భారత్ చివరిసారిగా పాకిస్థాన్ లో పర్యటిచింది. 2012 తర్వాత ఇరు జట్లు ఐసీసీ ట్రోఫీలో మాత్రమే తలబడుతున్నాయి. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ లో జరగనుంది. ఈ పర్యటనకు పాక్ గడ్డపై భారత్ అడుగుపెట్టే అవకాశాలు కనిపించడం లేదు.    

 ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, తీవ్రవాదం, కాశ్మీర్ అంశాల్లో వివాదం నడుస్తుంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ వేదికగా జరిగే ఏ క్రికెట్ మ్యాచుల్లోనూ పాల్గొనటం లేదు ఇండియా జట్టు. 2023లో ఆసియా కప్ ను సైతం బహిష్కరించింది టీమిండియా. ఇప్పుడు కూడా అలాంటి నిర్ణయమే ఉంటుందని.. మార్పు ఉండకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే మరో నాలుగు నెలల సమయం ఉండటంతో దౌత్యపరమైన చర్చల తర్వాత ఇండియా పాకిస్తాన్ వెళుతుందా లేదా అనేది వేచి చూడాలి.    

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies