గుడ్ న్యూస్ పేటీఎంకు కొత్త యూపీఐ కస్టమర్లు
జాతీయ National News భారత్ ప్రతినిధి : కొత్త యూపీఐ వినియోగదారులను చేర్చుకోవడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) పేటీఎంకి అనుమతిని మంజూరు చేసింది. అన్ని విధానపరమైన మార్గదర్శకాలకు, సర్క్యులర్‌లకు కట్టుబడి కొత్త వారిని తీసుకోవాలని స్పష్టం చేసింది. పేటీఎం యాప్‌లో కొత్త యూపీఐ వినియోగదారులను తీసుకోకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై ఈ ఏడాది ప్రారంభంలో ఆర్బీఐ ఆంక్షలు విధించింది.
రూల్స్‌ను పాటించనందుకే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మార్చిలో ఎన్సీపీఐ థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (టీపీఏపీ)గా యూపీఐలో పాల్గొనడానికి పేటీఎంకి అనుమతి ఇచ్చింది. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యెస్ బ్యాంకుల ద్వారా యూపీఐ లావాదేవీలను కొనసాగించడానికి ఎన్పీసీఐకంపెనీని అనుమతించింది.
ఇదిలా ఉండగా, జొమాటోకు వినోదం, టికెటింగ్ వ్యాపారాన్ని విక్రయించడం ద్వారా అనూహ్యంగా లభించిన లాభం కారణంగా, సెప్టెంబర్ 2024తో ముగిసిన క్వార్టర్లో వన్97 కమ్యూనికేషన్స్ రూ. 928.3 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం రూ. 290.5 కోట్ల నష్టం వాటిల్లింది.
National Payments Corporation of India (NPCI) has granted permission to Paytm to add new UPI users. It has been made clear that new people should be hired by adhering to all procedural guidelines and circulars. Earlier this year, the RBI had imposed restrictions on Paytm Payments Bank Limited (PPBL) from accepting new UPI users on the Paytm app.
This decision was taken because the rules were not followed. In March this year, NCPI allowed Paytm to participate in UPI as a third-party application provider (TPAP). NPCI has allowed the company to continue UPI transactions through SBI, Axis Bank, HDFC Bank and Yes Bank.
Meanwhile, One97 Communications for the quarter ended September 2024 on the back of a windfall from the sale of entertainment and ticketing business to Zomato. 928.3 crore net profit. A year ago Rs. 290.5 crores loss.