Type Here to Get Search Results !

Sports Ad

హెచ్ఎండీఏ చెరువులపై ప్రభుత్వం కీలక నిర్ణయం Government's Key Decision On HMDA Ponds

హెచ్ఎండీఏ చెరువులపై ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ఎండీఏ  పరిధిలో చెరువులపై సమగ్ర సర్వే కు ఆదేశించింది. గ్రేటర్ లోని చెరువుల విస్తీర్ణం, FTL, బఫర్ జోన్లను గుర్తించాలని నిర్ణయించింది. మూడు నెలల్లో సర్వే పూర్తి చేయాలని ఇరిగేషన్, రెవిన్యూ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. సర్వే పూర్తయ్యాక చెరువుల వివరాలను వెబ్ సైట్ లో పెట్టనుంది ప్రభుత్వం. 

 ఇటీవలే  ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఆక్రమణలు హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ కూల్చివేతలపై కొందరు హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే విచారణ సందర్శంగా చెరువుల FTL  పరిధిని నిర్ధారించారా అని ప్రభుత్వాన్ని  ప్రశ్నించింది హైకోర్ట్. ఈ క్రమంలోనే ముందుగా ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లను గుర్తించాలని ఆదేశించింది ప్రభుత్వం.

  మరి అప్పటి వరకు హైడ్రా కూల్చివేతలు ఉంటాయా లేదా అన్న దానిపై సందిగ్ధత నెలకొంది. మరో వైపు ఇటీవలే హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో హైడ్రాకు మరిన్ని పవర్స్ వచ్చినట్టైంది.

Telangana government has taken a crucial decision. A comprehensive survey of ponds under HMDA has been ordered. Area of ​​ponds in Greater, FTL, decided to identify buffer zones. Irrigation and Revenue Departments have been directed to complete the survey within three months. After the completion of the survey, the government will put the details of the ponds on the website. 

 It is known that recently Hydra demolished the encroachments in FTL and buffer zone. Some petitioned the High Court against these demolitions. However, the High Court questioned the government as to whether the FTL extent of the ponds had been ascertained during the inquiry. In this order, the government has ordered to identify FTL and buffer zones first. And till then there is doubt whether there will be any demolition of Hydra or not. 

 On the other hand, it is known that the governor approved the ordinance issued recently giving legitimacy to HYDRA. With this it seems that Hydra got more powers.

మరిన్ని వార్తల కోసం....
* రుణమాఫీ చేసినం ఇదిగో ప్రూఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి
* దళిత కుటుంబంతో కలిసి వంట చేసిన రాహుల్ గాంధీ ఇక్కడ క్లిక్ చేయండి
* ఇప్పటికైనా మారండి కేకుల తయారీపై బేకరీలకు ప్రభుత్వం వార్నింగ్ ఇక్కడ క్లిక్ చేయండి
* టీమిండియా ప్లేయింగ్ 11లో మయాంక్ నితీష్ లక్నో,సన్‌రైజర్స్ జట్లకు బిగ్ షాక్ ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies