Type Here to Get Search Results !

Sports Ad

ఇప్పటికైనా మారండి కేకుల తయారీపై బేకరీలకు ప్రభుత్వం వార్నింగ్ Govt Warning To Bakeries On Making Marandi Cakes

ఇప్పటికైనా మారండి కేకుల తయారీపై బేకరీలకు ప్రభుత్వం వార్నింగ్

Health News భారత్ ప్రతినిధి : కేకుల తయారీ బేకరీలపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్ గా ఉంది. కేకుల తయారీ ప్రాణాంతకమైన రోగాలకు కారణమయ్యే పదార్థాలను వాడుతున్నారని..పద్దతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని గట్టి వార్నింగ్ ఇచ్చింది. రాష్ట్రంలోని కొన్ని బేకరీల్లో కేకుల తయారీలో ప్రాణాంతకమైన క్యాన్సర్ కు కారణమైన పదార్థాలు వాడుతున్నారని గుర్తించిన కర్ణాటక ఫుడ్ సేఫ్టీ, క్వాలిటీ కంట్రోల్ డిపార్టుమెంట్ బేకరీల యజమానులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. 

 రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేసిన కర్ణాటక ఫుడ్ సేఫ్టీ, క్వాలిటీ కంట్రోల్ శాఖ అధికారులు కొన్ని బేకరీలు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లలో సేకరించిన కబాబ్‌లు, మంచూరియన్, పానీ పూరీ వంటి ఆహార పదార్థాల శాంపిల్స్‌లో కార్సినోజెన్స్ అనే క్యాన్సర్ కారక పదార్ధాలున్నట్లు గుర్తించారు. అయితే ఇది రెండు నెలల క్రితం జరిగింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 ఆగస్టులో కర్ణాటకలోని పలు బేకరీలపై దాడులు నిర్వహించింది అక్కడి ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ కంట్రోల్ డిపార్టుమెంట్. 235 రకాల కేకుల శాంపిల్ష్ సేకరించిన ల్యాబ్ టెస్ట్ చేసింది. కేకుల తయారీలో మొత్తం 12 రకాల కృత్రిమ రంగులు కలుపుతున్నారని ఇవి ఆరోగ్యానికి ప్రమాదకరం అని తేల్చింది. 
కృత్రిమ రంగులైన అల్లూరా రెడ్, సన్‌సెట్ ఎల్లో ఎఫ్‌సిఎఫ్, పోన్సీయు 4ఆర్ (స్ట్రాబెర్రీ రెడ్), టార్ట్రాజైన్ (నిమ్మ పసుపు), కార్మోయిసిన్ (మెరూన్) వంటి వాటిని కలపాల్సిన దానికంటే ఎక్కువ కలిపితే క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు పెరుగుతాయని హెచ్చరించింది.

 అంతేకాదు మానసిక, శారీరక ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని తెలిపింది. బేకరీలు ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు కంటికి ఆకట్టుకునే కలర్లను ఇష్టపడుతుండటంతో హోటళ్లు, బేకరీలు, వీధుల్లో దొరికే  ప్యాక్ చేసిన ఫుడ్ లో కృత్రిమ రంగులను కలుపుతున్నారు. వీటిలో టైటానియం డయాక్సైడ్ ఉంటుంది. ఇది మన దేశంలో అనుమతించారు కానీ..యూరప్ వంటి అనేక మధ్య ప్రాచ్య దేశాల్లో నిషేధించారు. ఇది తినే పదార్థాల్లో కలిపితే హానికరం కాబట్టి ఆహార పదార్థాల్లో ఇటువంటి పదార్థాలను నిషేంధించాలని ఫుడ్ సేఫ్టీ ప్రచార కర్తలు కోరుతున్నారు. 

Karnataka government is serious about cake making bakeries. It has given a stern warning that the preparation of cakes is using ingredients that cause fatal diseases. The Karnataka Food Safety and Quality Control Department has issued a strong warning to the owners of the bakeries after finding that some of the bakeries in the state are using deadly cancer-causing ingredients. 

 The officials of the Karnataka Food Safety and Quality Control Department, who conducted inspections across the state, found the presence of carcinogens in the samples of food items such as kebabs, Manchurian and pani puri collected from some bakeries and street food centers. But this was two months ago. It is going viral on social media. 

 In August, several bakeries in Karnataka were raided by the Food Safety and Quality Control Department. 235 samples of cakes were collected and tested by the lab. It concluded that 12 types of artificial colors are added in the preparation of cakes.. These are dangerous for health. 

 Artificial colors such as Allura Red, Sunset Yellow FCF, Ponceau 4R (Strawberry Red), Tartrazine (Lemon Yellow), Carmoisine (Maroon) have been warned to increase the risk of cancer if added more than they should. Moreover, it said that there will be a threat to mental and physical health. Bakeries have been warned that they must comply with food safety standards or strict action will be taken. 

 As people like eye-catching colors, hotels, bakeries and packaged food found on the streets are adding artificial colors. These contain titanium dioxide. It is allowed in our country but banned in many middle eastern countries like Europe. Food safety campaigners want to ban such substances in food as it is harmful when mixed with food.

మరిన్ని వార్తల కోసం....
* రుణమాఫీ చేసినం ఇదిగో ప్రూఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి
* హెచ్ఎండీఏ చెరువులపై ప్రభుత్వం కీలక నిర్ణయం ఇక్కడ క్లిక్ చేయండి
* దళిత కుటుంబంతో కలిసి వంట చేసిన రాహుల్ గాంధీ ఇక్కడ క్లిక్ చేయండి
* టీమిండియా ప్లేయింగ్ 11లో మయాంక్ నితీష్ లక్నో,సన్‌రైజర్స్ జట్లకు బిగ్ షాక్ ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies