ఇతని ధైర్యం ముందుచూపుకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే కాటువేసిన పామును ఆస్పత్రికి పట్టుకెళ్లాడు
జాతీయ National News భారత్ ప్రతినిధి : పాము సమీపంలో కనిపిస్తేనే చాలు అంతదూరం భయంతో పరుగులు పెడతాం స్నేక్ క్యాచర్లను పిలిపించి పట్టిస్తాం పాము అక్కడ లేదు అని నిర్ధారించుకునే వరకు హడల్ పోతాం అలాంటిది పాము కరిచినా ఇతను భయంపడలేదు. పామును పట్టుకొని మెడలో వేసుకుని ఆస్పత్రికి వెళ్లాడు. బీహార్ లో ఓ వ్యక్తికి పాము కరిస్తే దాన్ని వెంటాడి మరీ పట్టుకొని మెడలో వేసుకొని ఆస్పత్రికి వెళ్లిన దృశ్యాలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ సోషల్ మీడియాలోవైరల్ అవుతోంది వివరాల్లోకి వెళితే.
బీహార్కు చెందిన 48 యేళ్ల ప్రకాశ్ మండల్ అనే వ్యక్తిని మంగళవారం( అక్టోబర్15) పాము కాటు వేసింది. మామూలు పాము కాదు ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము అది. అయినా మండల్ ధైర్యం కోల్పోలే దానిని పట్టుకొని మెడలోవేసుకొని ఆస్పత్రి వచ్చాడు. అది చూసి ఆస్పత్రి సిబ్బందితోపాటు డాక్టర్ కూడా షాక్ అయ్యారు. తేరుకుని ట్రీట్ మెంట్ చేశారు. ప్రకాశ్ మండల్ తన ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటుకు గురయ్యాడు. భాగల్పూర్ లోని జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తనను కాటు వేసిన పామును పట్టుకొని వచ్చాడు. ఎందుకంటే ఆ పాము జాతిని గుర్తించి డాక్టర్లు వైద్యం చేసేందుకు సహకరిస్తుందని పామును మెడలో వేసుకొని వచ్చాడు.
మెడలో పాము చుట్టుకొని చేతిలో పాము మెడ పట్టుకొని ఆస్పత్రికి వచ్చిన మండల్ ను చూసి ఆస్పత్రి సిబ్బంది, అక్కడున్న వారంతా షాకయ్యారు. భయంతో దూరం జరిగారు. షాక్ నుంచి తేరుకున్నాక ట్రీట్ మెంట్ ఇచ్చారు. మండల్ ను ధైర్యాన్ని డాక్టర్ తెగమెచ్చుకున్నాడు. మండల్ ను, అతను తెచ్చిన పామును వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు.
ఈ వీడియో పెట్టినప్పటినుంచి తెగవైరల్ అవుతోంది. 7లక్షల 41వేల మంది ఈ వీడియో ను చూశారు. నెటిజన్లు మండల్ ధైర్యాన్ని, ముందుచూపును మెచ్చుకున్నారు. దీంతో పాటు పామును గురించి చెపుతూ ఇది రస్సెల్ వైపర్చాలా ప్రాణాంతమైనది. ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండాలి అంటూ రాశారు.
ఇలాంటి సంఘటన ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి పామును మెడలో వేసుకున్న వీడియో వైరల్ అయింది. ఇంటి బయట కూర్చున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి ఏమీ అనిపించలేదు గానీ..చూస్తున్న స్థానికులు మాత్రం భయంతో వణికిపోయారు.
If we see a snake nearby, we run away in fear. He took the snake around his neck and went to the hospital. A video footage of a person bitten by a snake in Bihar is going viral on social media.
A 48-year-old Prakash Mandal from Bihar was bitten by a snake on Tuesday (October 15). Not an ordinary snake It is the most venomous snake in the world. However, Mandal could not lose his courage. Seeing that, the hospital staff and the doctor were also shocked. He recovered and was treated.
Prakash Mandal was bitten by a snake while sleeping in his house. He came to the Jawaharlal Nehru Medical College Hospital in Bhagalpur holding the snake that had bitten him. Because he brought the snake around his neck to help the doctors to identify the species of the snake.
The hospital staff and everyone there were shocked to see Mandal who came to the hospital with a snake wrapped around his neck and holding the snake's neck in his hand. Scared away. After recovering from shock, treatment was given. The doctor praised Mandal for his courage. Videos of Mandal and the snake he brought were posted on social media.
This video has been going viral ever since it was posted. 7 lakh 41 thousand people watched this video. Netizens appreciated Mandal's courage and foresight. Also talking about the snake this is the Russell Viper.. very deadly. He wrote that such things should be far away.
A similar incident happened recently in Andhra Pradesh as well. A video of a drunken man hanging a snake around his neck has gone viral. The incident happened while sitting outside the house. The drunken man did not feel anything, but the locals who were watching were trembling with fear.