బంగారం ధర భారీగా తగ్గడం అంటే ఇది ఒకేసారి ఇంత తగ్గిందేంటయ్యా
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఈ ధన త్రయోదశికి బంగారం కొనాలనుకునే వినియోగదారులకు ఇది నిజంగా శుభవార్తేనని చెప్పాలి. ఈ మధ్య స్వల్పంగా తగ్గుతూ, భారీగా పెరుగుతూ పోయిన బంగారం ధరల ట్రెండ్ ఇవాళ(అక్టోబర్ 28, 2024) మారింది. ఈ సోమవారం (అక్టోబర్ 28, 2024) బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఆదివారం నాడు 80,290 రూపాయలు ఉండగా సోమవారం 79,800 రూపాయలుగా ఉంది. అంటే బంగారం ధర ఏకంగా 490 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఆదివారం 73,600 ఉండగా, సోమవారం 73,150 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై 450 రూపాయలు తగ్గింది.
బంగారం ధర 10 గ్రాములపై దాదాపు 500 రూపాయలు తగ్గినప్పటికీ అక్టోబర్ నెల ఆరంభానికి ఇప్పటికీ పోల్చి చూస్తే మాత్రం భారీగా పెరిగింది. అక్టోబర్ 1న 24 క్యారెట్ల బంగారం ధర 76,910 రూపాయలుగా ఉండగా అక్టోబర్ 28న 79,800 రూపాయలుగా ఉంది. అంటే నెల ఆరంభానికి ఇప్పటికీ 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై 2890 రూపాయలు పెరిగింది. ఒక్క నెలలో బంగారం ధర దాదాపు 3000 రూపాయలు పెరిగే దిశగా దూసుకెళ్తోంది. జూన్, జులై నెలల్లో బంగారం ధరల ట్రెండ్ పరిశీలిస్తే.. ఆ రెండు నెలలు బంగారం ధరల్లో తగ్గుదల కనిపించింది.
ఆ తర్వాత ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఇలా వరుసగా మూడు నెలల నుంచి బంగారం ధర పైపైకి ఎగబాకుతూనే ఉంది. అక్టోబర్ నెలలో 24 క్యారెట్ల బంగారం ధర ఇప్పటివరకూ 3.76 శాతం పెరిగింది. ఎకనమిక్ స్లోడౌన్, ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
సాధారణంగా రెసిషన్ సమయాల్లో పుత్తడికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏడుసార్లు రెసిషన్ రాగా, ఐదుసార్లు బంగారంలోకి భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఇన్ఫ్లేషన్ పెరిగినా బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. స్టాక్స్, బాండ్లు, కరెన్సీల్లో రాబడులు తగ్గినా విలువ పెరుగుతుంది. ఇక వెండి ధరల్లో మాత్రం సోమవారం(అక్టోబర్ 28, 2024) ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్లో కిలో వెండి ధర 1,07,000 రూపాయలుగా ఉంది.