Type Here to Get Search Results !

Sports Ad

సైబర్ క్రైమ్ I4C అంబాసిడర్ గా నేషనల్ క్రష్ రష్మిక మందాన National Crush Rashmika Mandana As Cybercrime I4C Ambassador

సైబర్ క్రైమ్ I4C అంబాసిడర్ గా నేషనల్ క్రష్ రష్మిక మందాన

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నను 'సైబర్ భద్రతను ప్రోత్సహించడానికి నేషనల్ అంబాసిడర్'గా నియమించింది. ఈ విషయాన్ని రష్మిక మందాన సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకి తెలిపింది. 

 గతంలో కొందరు తన ఫోటోలను ఉపయోగించి డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా అసభ్యకర వీడియోలని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని దీంతో సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ చేయడంతో గవర్నమెంట్ తనకి ఎంతగానో సహకరించిందని తెలిపింది. దీంతో అప్పటినుంచి సైబర్ నేరాల గురించి అవగాహన కలిగించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 

 తనని I4C కి అంబాసిడర్'గా నియమించినందుకు సంతోషంగా ఉందని, మన కోసం మరియు భవిష్యత్తు తరాలకు సురక్షితమైన సైబర్‌స్పేస్‌ను నిర్మించేందుకు ఏకం అవుదామని పిలుపునిచ్చింది. అలాగే సైబర్ క్రైమ్ గురించి ఏదైనా సహాయం కావాలంటే 1930 నంబర్ కి కాల్ చేయడం లేదా cybercrime.gov.inని సందర్శించాలని తెలియజేసింది.

 ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రష్మిక మందాన ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2: ది రూల్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 6న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies