టమాటా సాస్ ఉపయోగిస్తున్నారా అయితే కచ్చితంగా మీరు ఈ విషయం తెలుకోవాల్సిందే
Health News భారత్ ప్రతినిధి : ఫాస్ట్ ఫుడ్, పఫ్స్, శాండ్‌విచ్, పాస్తా, బర్గర్, ఫ్రెంచ్ ప్రైస్ వంటివి తినేందుకు టామాటా సాస్/కెచప్ ఉండాల్సిందే. ఈ ఐటెమ్స్ సాస్‌తో కలిపి తింటే వచ్చే టెస్టే వేరు. దీంతో టమాటో సాస్ వినియోగం ఇటీవల విపరీతంగా పెరిగిపోవడంతో మార్కెట్లో దానికి ఉన్న డిమాండ్‌ను క్యాచ్ చేసుకుని కొందరు సాస్‌ను కల్తీ చేసి విక్రయిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 800 కిలోల కల్తీ సాస్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోన్న కల్తీ సాస్ తయారీ ముఠాను ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.
సింథటిక్ రెడ్ కలర్స్, యారోరూట్ పౌడర్‌ను ఉపయోగించి కల్తీ టొమాటో కెచప్‌ను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నాలుకకు ఎంతో టెస్టీగా అనిపించే టామాటా సాస్ కూడా కల్తీ జరుగుతుండటంతో సాస్ ప్రియులు జంకుతున్నారు. ఈ కల్తీ సాస్ తింటే కాలేయం, ప్యాంక్రియాస్, గ్యాస్ట్రిటిస్ వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉండటంతో సాస్ రుచి చూడాలంటేనే భయపడుతున్నారు. దీంతో మార్కెట్లో దొరికే సాస్ మంచిదా కల్తీ జరిగిందా అనేది మీరే ఈజీగా తెలుసుకోవచ్చు. మూడు విధాలుగా సాస్ కల్తీ జరిగిందా లేదా అనే విషయాన్ని ఇట్టే కనిపెట్టొచ్చు.
నీటి పరీక్ష: మార్కెట్ నుండి తీసుకెళ్లిన సాస్/ కెచప్‌ను గ్లాసు నీటిలో ఒక చెంచా వేయండి. అప్పుడు సాస్ త్వరగా నీటిలో కరిగిపోయి ఎరుపు రంగు పోతే అది కల్తీ సాస్ అని అర్థం దానిని సింథటిక్ రంగులతో తయారు చేశారని గుర్తించాలి. నాణ్యమైన సాస్ నీటిలో తేలుతూ రంగు మారదు.
అయోడిన్ పరీక్ష: సాస్‌పై కొంత అయోడిన్ వేసి బాగా కలపాలి. సాస్ నీలం రంగులోకి మారితే అది కల్తీ జరిగినట్లు. దానిని ఆరోరూట్ వంటి పిండి పదార్ధాలతో తయారు చేశారని అర్థం.
రంగు పరీక్ష: మంచి నాణ్యత గల టొమాటో సాస్ ఏకరీతి ఎరుపు రంగులో ఉండాలి. సాస్‌లో ముదురు మచ్చలు ఉంటే, అది అచ్చును కలిగి ఉండవచ్చు.
పై మూడు విధానాల ద్వారా మార్కెట్ లో మనం తెచ్చుకున్న సాస్ కల్తీ జరిగిందో లేదో సులభంగా గుర్తించవచ్చు.